అనుకున్నది సాధించిన ఎన్డీఏ ప్రభుత్వం

వక్ఫ్‌ సవరణ బిల్లుకు పార్లమెంట్‌ ఉభయసభలు ఆమోదం

ముస్లింల పట్ల వివక్ష అంటూ విపక్షాల గగ్గోలు

ముస్లింల సంక్షేమం కోసమే ఈ చట్టమన్న కేంద్రం

2013లో సవరణ చట్టం తేకపోతే ప్రస్తుత చట్టం అవసరం వుండేది కాదు: అమిత్‌ షా

విపక్షాల దాడులను సమర్థవంతంగా తిప్పికొట్టిన బీజేపీ మంత్రులు, నాయకులు

సభకు రాని రాహుల్‌ గాంధీ, ప్రియాంకా గాంధీ

విదేశ పర్యటనలో ప్రధాని నరేంద్రమోదీ

అయినా బిల్లుకు ఆమోదం

ప్రభుత్వానికి మోదం, విపక్షాలకు ఖేదం

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్‌, ఎఫిసియన్సీ అండ్‌ డెవలప్‌మెంట్‌ బిల్‌ (ఉమీద్‌`యూఎంఈఈడీ) పేరుతో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బిల్లుపై వాడివేడి చర్చ ల అనంతరం ఉభయసభలు ఆమోదం తెలిపాయి. లోక్‌సభలో ఏప్రిల్‌ 2న ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టగా 14గంటల పాటు ఏకబిగిన చర్చ జరిగింది. ఇండీ కూటమిలోని విపక్షాలు ఏక గ్రీవంగా ఈ బిల్లును వ్యతిరేకించగా, ఎన్డీఏ కూటమి పక్షాలు బిల్లును సమర్థించాయి. ఫలితం గా బిల్లుకు అనుకూలంగా 288 మంది, వ్యతిరేకిస్తూ 232మంది సభ్యులు ఓటు చేయడంతో లోక్‌సభ ఆమోదం పొందింది. ఇక ఏప్రిల్‌ 3న మధ్యాహ్నం రాజ్యసభలో ప్రవేశపెట్టిన బిల్లుపై అర్థరాత్రి దాటేవరకు 13 గంటలపాటు సుదీర్ఘ చర్చ జరిగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో రా జ్యసభ దద్దరిల్లింది. కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు సమాధానం తర్వాత సవరణల వారీగా ఓటింగ్‌జరిగింది. బిల్లుకు అనుకూలంగా 128 మంది, వ్యతికిస్తూ 95మంది ఓటు చేశారు. ఈ బిల్లు ఆ మోదంతో పాటు ముసల్మాన్‌ వక్ఫ్‌ (ఉపసంహరణ) బిల్లును కూడా పార్లమెంట్‌ ఉభయసభలుఆమోదించాయి. బిల్లును రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. 

ముస్లింలకు వ్యతిరేకం కాదు

రాజ్యసభలో మంత్రి కిరణ్‌ రిజిజు చర్చను ప్రారంభిస్తూ, వక్ఫ్‌ సవరణ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదని, ఏ ఒక్కరి మత విశ్వాసాలను దెబ్బతీయడం ప్రభుత్వ ఉద్దేశం కాదని స్పష్టం చేశారు ఈ బిల్లుకు మతంతో ఎటువంటి సంబంధం లేదన్నారు. ముస్లింలలోని షియా, సున్నీలతోపాటు ఇతర వెనుకబడిన తరగతులవారు వక్ఫ్‌ బోర్డు సభ్యులుగా కొనసాగేలా నిబంధనలు చేర్చామన్నారు. 22మంది సభ్యులతో ఏర్పడే సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ కూర్పుపై వ్యక్తమవుతున్న సందేహాలకు సమాధానమిచ్చారు. ముస్లిమేతరులు అధికంగా వుంటారన్న సమస్యే ఉత్పన్నం కాదన్నారు. ఈ కౌన్సిల్‌లో ముస్లిమేతరుల సంఖ్య నాలుగుకు మాత్రమే పరిమితమన్నారు. వక్ఫ్‌ బోర్డులు చట్టపరమైన సంస్థలు. అంతేతప్ప ఇవి ముస్లింలకు ప్రాతినిధ్యం వహించే సంస్థలు కావని స్పష్టం చేశా రు. వక్ఫ్‌ ట్రిబ్యునళ్ల వద్ద ఇప్పటికే 31999 కేసులు పెండిరగ్‌లో ఉన్నాయి. ఇప్పటికే కోర్టులు తీర్పు ఇచ్చిన వాటిజోలికి ప్రభుత్వం వెళ్లబోదని స్పష్టం చేశారు. తుర్కియే, మలేసియా, సౌదీ అరేబియా వంటి ముస్లిం దేశాలు ప్రత్యేక చట్టాల ద్వారా వక్ఫ్‌ ఆస్తులను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకొచ్చి ప్రజలకు ఉపయోపడేలా చేశాయన్న సంగతిని కేంద్ర మంత్రి, జె.పి.నడ్డా గుర్తుచేశారు.1913`2013 మధ్యకాలంలో వక్ఫ్‌ భూములు 18లక్షల ఎకరాలుండగా 2013`25 మధ్య కాలంలో ఇవి మరో 21లక్షల ఎకరాలకు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. ఈ ఆస్తులు దుర్విని యోగం కాకుండా కాపాడటమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. 

లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా మంత్రి కిరణ్‌ రిజుజు మాట్లాడుతూ తాము ప్రతిపాదిస్తున్న సవరణలే లేకపోతే పార్లమెంట్‌ భూమిని కూడా వక్ఫ్‌ ఆస్తులే అంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో ఆలిండియా ముస్లిం డెమోక్రటిక్‌ ఫ్రంట్‌ (ఏఐయూడీఎఫ్‌) చీఫ్‌ బద్రుద్దీన్‌ అజ్మల్‌ పార్లమెంట్‌ భవనం, దాని పరిసర ప్రాంతాలు వక్ఫ్‌ ఆస్తుల్లో భాగమేనన్న నేపథ్యంలో మంత్రి ఈ వ్యాఖ్యలు చేసినట్టు భావించాలి. ముస్లిం మత వ్యవహారాల్లో జోక్యంగా విపక్షాలు చేసిన ఆరోపణలను హోమంత్రి అమిత్‌షా ఖండిరచారు. ‘‘ఈ సవరణను మైనారిటీలు ఒప్పుకోరని కొంద రంటున్నారు. ఇది పార్లమెంట్‌ చేసిన చట్టం. ప్రతి ఒక్కరూ అంగీకరించి తీరాల్సిందే’’ అని స్ప ష్టం చేశారు. ‘‘2014లో నాటి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యు.పి.ఎ. సర్కార్‌ వక్ఫ్‌ చట్టానికి రాత్రి కి రాత్రే చట్టానికి అతీతంగా సవరణలు చేసిందని, ఇది ముస్లింల సంతుష్టీకరణ రాజకీయాలకు పరాకాష్ట. లేదంటే ఈ సవరణ బిల్లు అవసరమే వుండేది కాదు’’ అని ఆయన అన్నారు. ‘‘యుపీ ఏ నిర్ణయం వల్ల న్యూఢల్లీిలోని ల్యూటెన్స్‌ జోన్‌లో 123 ఆస్తులు కేవలం 25 రోజుల్లో వక్ఫ్‌ ఆస్తులుగా మారిపోయాయి. ఇటువంటి అవకతవకలు సరిదిద్దడం, వక్ఫ్‌ పాలన ప్రజాస్వామ్య బద్ధం గా పారదర్శకంగా జరిగేలా చూడటమే ఈ బిల్లు ఉద్దేశమన్నారు. కేవలం వక్ఫ్‌ ఆస్తి అని ప్రక టించినంత మాత్రాన ఎవరి భూమి వక్ఫ్‌ భూమిగా మారకుండా ఈ చట్టం రక్షణ కల్పిస్తుంది’’ అని అమిత్‌ షా వివరించారు. 

రాహుల్‌ గాంధీ గైర్హాజరు

కీలకమైన వక్ఫ్‌ (సవరణ) బిల్లుపై పార్లమెంట్‌లో చర్చ జరుగుతున్నప్పుడు ఓటింగ్‌కు విపక్షనేత రాహుల్‌గాంధీ గైర్హాజరయ్యారు. వాయనాడ్‌ ఎంపీ, ఆయన సోదరి ప్రియాంకా వాద్రా కూడా సభలో లేకపోవడం గమనార్హం. ఈ బిల్లుపై అనుసరించాల్సిన వ్యూహంపై ముందుగా కాంగ్రెస్‌ ఎంపీలతో చర్చించిన ఆయన, చర్చలో పాల్గనరాదని నిర్ణయించుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీకి గంటా నలభై నముషాలు సమయం కేటాయించగా గౌరవ్‌ గొగోయ్‌ తదితర ఎంపీలు మాత్రమే చ ర్చలో పాల్గనడం గమనార్హం. నిజం చెప్పాలంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) పరిశీలనకు వెళ్లిన తొలి బిల్లు ఇది. గత ఏడాది ఆగస్టులో ఈ బి ల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం ఎంతగా ప్రయత్నించినా విపక్షాలనుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురుకావడంతో చివరకు జేపీసీకి పంపక తప్పలేదు. 

వక్ఫ్‌ బిల్లు ఏం చెబుతోంది?

తాజా వక్ఫ్‌ చట్టం ప్రకారం వక్ఫ్‌ బోర్డులను మరింత బలోపేతం చేస్తారు. నిర్మాణాత్మక ఎంపిక ప్రక్రియ చేపడతారు. వివాదాల పరిష్కారానికి నిర్ణీత కాలావధిని నిర్ణయిస్తారు. వక్ఫ్‌బోర్డులకు, వక్ఫ్‌ సంస్థలు తప్పనిసరిగా చెల్లించాల్సిన మొత్తాన్ని వాటి వార్షిక ఆదాయంలో 7శాతం నుంచి 5 శాతానికి తగ్గించారు. రూ.లక్షకు మించిన ఆదాయం కలిగిన వక్ఫ్‌ సంస్థల అకౌంట్లను ప్రభుత్వ అధీకృత ఆడిటర్ల చేత ఆడిట్‌ చేయించడం తప్పనిసరి. వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణకోసం కేంద్రీ కృత పోర్టల్‌ను ఏర్పాటుచేస్తారు. దీనివల్ల వక్ఫ్‌ ఆస్తులపై పారదర్శకత ఏర్పడుతుంది. వితంతువులు, విడాకులు పొందిన మహిళలు మరియు అనాధలకు సంబంధించి ఈ చట్టంలో ప్రత్యేక ని బంధనలను పొందుపరచారు. ముస్లిం మహిళలు తమ వారసత్వ అంశాన్ని వక్ఫ్‌ డిక్లరేషన్‌ ముందుకు తీసుకు రావచ్చు. ప్రభుత్వ భూములను వక్ఫ్‌ ఆస్తులుగా పేర్కొంటున్న వాటి విషయంలో నిర్ణయించేందుకు కలెక్టర్‌కంటే ఉన్నతస్థాయి అధికారి విచారించి తగిన నిర్ణయం తీసుకుంటారు.వక్ఫ్‌ బోర్డులోకి ముస్లిమేతరులకు ప్రవేశం కల్పించారు. 

దేశంలో వక్ఫ్‌ ఆస్తులు

డబ్ల్యుఏఎంఎస్‌ఐ పోర్టల్‌లో పేర్కొన్న సమాచారం మేరకు దేశంలోని 30 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాలు మరియు 32 బోర్డులకు సంబంధించి 8,72,328 ఆస్తులుండగా వీటి మొత్తం విస్తీ ర్ణం 3816291.788 ఎకరాలు. ఈ మొత్తం ఆస్తుల్లో 4.02లక్షల ఆస్తులను వక్ఫ్‌ బోర్డు విని యోగంలో వున్నాయి. మిగిలిన వక్ఫ్‌ ఆస్తుల విషయానికి వస్తే 9279 కేసులకు సంబంధించి కే వలం 1083 వక్ఫ్‌ డీడ్స్‌ను మాత్రమే అప్‌లోడ్‌ చేశారు. ఇక వక్ఫ్‌ ఎస్టేట్స్‌ 356,350, స్థిరాస్తు లు 872,802, చరాస్తులు 16716 కాగా డిజిటలైజ్‌ అయిన రికార్డులు 330,008. 

వక్ఫ్‌ అంటే…

ముస్లిం చట్టాలు గుర్తించిన విధంగా ఎవరైనా వ్యక్తి తన యొక్క స్థిర/చరాస్తులను మతపరమైన దాతృత్వ కార్యకలాపాలకోసం దానంగా ఇవ్వడం అనేది వక్ఫ్‌ నిర్వచనం.

మతపరమైన, సామాజిక మరియు ఆర్థిక ప్రాధాన్యత కలిగిన వక్ఫ్‌ ఆస్తుల నియంత్రణ మరియు రక్షణ కోసం భారత ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అవసరానికి అనుగుణంగా చట్టాలను అమల్లోకితెచ్చాయి. ఇందులో మొట్టమొదటగా 1954లో తెచ్చిన వక్ఫ్‌ చట్టం ఈ ఆస్తుల నిర్వహణకు అవసరమైన పునాది వేసింది. తర్వాతి కాలంలో అవినీతి అక్రమాల నిరోధం, సరైన నిర్వహణ కోసంఎప్పటికప్పుడు కొత్త నిబంధనలు చట్టాలను ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఇందులో భాగంగానేనిర్వహణలో పారదర్శకత, పాలనను మరింత బలోపేతం చేయడంకోసం కేంద్ర ప్రభుత్వం వక్ఫ్‌ సవరణ చట్టం`2025ను బిల్లురూపంలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందింది.

1995లో కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన వక్ఫ్‌ చట్టం ప్రకారం వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ, ని యంత్రణ కొనసాగుతోంది. ఈ చట్టం కింద మూడు సంస్థలు ప్రధానంగా పాలనా బాధ్యతలు నిర్వహిస్తున్నాయి. 

1. సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ (సీడబ్యుసీ): కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విధానపరమైన సలహాలు, సూచనలు ఇస్తుంది. వక్ఫ్‌ ఆస్తులను నేరుగా నిర్వహించదు.

2. స్టేట్‌ వక్ఫ్‌ బోర్డులు (ఎస్‌డబ్ల్యుబీ): ఈ బోర్డులు ఆయా రాష్ట్రాల్లో వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ మరియు రక్షణ బాధ్యతలను నిర్వర్తిస్తాయి.

3. వక్ఫ్‌ ట్రిబ్యునల్స్‌: వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించిన వివాదాలను విచారించే ప్రత్యేక న్యాయ సంస్థలు.

ఈ సంస్థల ద్వారా సమస్యల సత్వర పరిష్కారంతో పాటు వక్ఫ్‌ ఆస్తుల సమర్థ మరియు పారద ర్శక నిర్వహణకు దోహదం చేశాయి.

భారత్‌లో వక్ఫ్‌ చరిత్ర

వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణ రక్షణకోసం దేశంలో అనేక చట్టాలు అమల్లో వున్నాయి.

1. ది ముసల్మాన్‌ వక్ఫ్‌ వాలిడేటింగ్‌ యాక్ట్‌ా1913: కుటుంబ ప్రయోజనం ముఖ్యంగా దాతృత్వ కార్యకలాపాలకోసం ముస్లింలు వక్ఫ్‌ను ఏర్పాటు చేయవచ్చు. వక్ఫ్‌ నిర్వహణకోసం ఈ చట్టాన్ని తీసుకువచ్చినా ఇది పూర్తి సమర్థవంతంగా పనిచేయలేదు.

2. ది ముసల్మాన్‌ వక్ఫ్‌ యాక్ట్‌ 1923: వక్ఫ్‌ నిర్వహణలో పారదర్శకత కోసం ఈ చట్టాన్ని అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది.

3. ది ముసల్మాన్‌ వక్ఫ్‌ వాలిడేటింగ్‌ యాక్ట్‌ 1930: కుటుంబ వక్ఫ్‌ల సాధికారతను మరింత బ లోపేతం చేసింది. 1913 వక్ఫ్‌ చట్టాన్నికి దన్నుగా దీన్ని అమల్లోకి తెచ్చారు.

4. ది వక్ఫ్‌ యాక్ట్‌ా1954: వక్ఫ్‌ ఆస్తుల పర్యవేక్షణకోసం మొట్టమొదటి సారి రాష్ట్రాల వక్ఫ్‌బోర్డు లను ఏర్పాటు చేశారు. భారత స్వాతంత్య్రం తర్వాత వక్ఫ్‌ నిర్వహణను మరింత బలోపేతం చేశారు. సెంట్రల్‌ వక్ఫ్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా 1964లో ఏర్పాటైంది. రాష్ట్రాల వక్ఫ్‌బోర్డుల పని తీరు పర్యవేక్షణ దీని ప్రధాన బాధ్యత. ఆవిధంగా వక్ఫ్‌బోర్డుల పాలన కేంద్రీకృతమైంది. 1954 వక్ఫ్‌ యాక్ట్‌ లోని 9(1) సెక్షన్‌ కింద ఈ సెంట్రల్‌ కౌన్సిల్‌ ఏర్పాటు జరిగింది.

5. ది వక్ఫ్‌ యాక్ట్‌ా1954కు సవరణలు (1959, 1964, 1969 మరియు 1984): ఇవి వక్ఫ్‌ పాలనను మరింత మెరుగు పరచడానికి ఉపయోగపడ్డాయి.

6. ది వక్ఫ్‌ యాక్ట్‌ 1995: దీన్ని సమగ్ర చట్టంగా రూపొందించారు. దీంతో 1954 వక్ఫ్‌ చట్టం దాని సవరణ చట్టాలు మొత్తం రద్దయ్యాయి. భారత్‌లో వక్ఫ్‌ ఆస్తుల నిర్వహణను ఆధీనంలో వుంచుకోవడానికి వీలుగా దీన్ని ప్రభుత్వం రూపొందించింది. వక్ఫ్‌ కౌన్సిల్‌, రాష్ట్రాల వక్ఫ్‌బోర్డులు, ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌, ముతావలి విధులు, బాధ్యతలు, అధికారాలను మరింత స్పష్టంగాఈ చట్టంలో పొందుపరచారు. మొట్టమొదటిసారి వక్ఫ్‌ ఆస్తుల వివాదాలపై విచారించేందుకు వక్ఫ్‌ ట్రిబ్యునల్స్‌ ఏర్పాటు జరిగింది. సివిల్‌ కోర్టుల అధికారాలే వీటికి వుంటాయి. వక్ఫ్‌ ట్రిబ్యునల్‌ ఇచ్చే తీర్పులను ఏ సివిల్‌ కోర్టులో సవాలు చేయడానికి వీల్లేదు. 

7. వక్ఫ్‌ సవరణ చట్టరా2013: దీని ద్వారా వక్ఫ్‌ చట్టంలో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. ముగ్గురు సభ్యులతో కూడిన వక్ఫ్‌ ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేసింది. వీరిలో ముస్లిం చట్టాలపై పూర్తి అవగాహన వున్న నిపుణుడు ఒకరు సభ్యుడిగా వుంటారు. ప్రతి రాష్ట్ర వక్ఫ్‌ బోర్డులో ఇద్దరు మహిళలకు స్థానం కల్పించింది. వక్ఫ్‌ ఆస్తులను అమ్మడం లేదా బహుమతిగా ఇవ్వడాన్ని నిషేధించింది. వక్ఫ్‌ ఆస్తుల లీజ్‌ కాలాన్ని మూడేళ్లనుంచి 30ఏళ్లకు పెంచింది.

8. వక్ఫ్‌ సవరణ చట్టరా2025: వక్ఫ్‌ పరిపాలనను మరింత ఆధునికీకరించడంపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా లీగల్‌ వివాదాల తగ్గింపు, సామర్థ్యాన్ని మరింత పెంచడం ప్రధాన లక్ష్యం. 1995 వక్ఫ్‌ చట్టం, 2013 వక్ఫ్‌ సవరణ చట్టాల్లోని లోపాలను సరిదిద్దడం ప్రధాన ఉద్దేశం. 

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ పథకాలు

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ముస్లింలకోసం రెండు పథకాలను అమలు చేస్తోంది. 1. ది క్వామీ వక్ఫ్‌ బోర్డ్‌ తరాఖియతి స్కీమ్‌ (క్యుడబ్ల్యుబీటీఎస్‌), 2. సహరాయ్‌ వక్ఫ్‌ సంపత్తివికాస్‌ యోజన (ఎస్‌డబ్ల్యుఎస్‌వీవై). రాష్ట్రాల వక్ఫ్‌బోర్డులను ఆధునికీకరించడం, స్వయంచాలి తం చేసేందుకు ఈ పథకాలను కేంద్రం అమలు చేస్తోంది. 

 క్యుడబ్ల్యుబీటీఎస్‌ కింద కేంద్ర ప్రభుత్వం సీడబ్ల్యుసీల ద్వారా రాష్ట్రాల వక్ఫ్‌బోర్డులకు గ్రాంట్‌`ఇన్‌`ఎయిడ్‌ అందజేస్తుంది. ముఖ్యంగా కంప్యూటరీకరణ, వక్ఫ్‌ బోర్డు ఆస్తుల రికార్డుల డిజిటలైజేషన్‌తో పాటు ఆయా వక్ఫ్‌బోర్డుల పాలనా సామర్థ్యాన్ని పెంచేందుకు సహక రిస్తుంది.

 ఎస్‌డబ్ల్యుఎస్‌వీవై ద్వారా రాష్ట్రాల వక్ఫ్‌బోర్డులకు వడ్డీలేని రుణాలను మంజూరు చేస్తుంది. వీటిద్వారా వక్ఫ్‌ ఆస్తుల్లో వాణిజ్య ప్రాజెక్టులను చేపట్టి వాటిద్వారా ఆదాయాన్ని పొందే లా చేయడం దీని ప్రధాన లక్ష్యం.

 2019ా20 నుంచి 2023ా24 మధ్యకాలంలో కేంద్రం క్యుడబ్ల్యుబీటీఎస్‌ మరియు ఎస్‌డబ్ల్యుఎస్‌వీవై కింద రూ.23.87 కోట్లు మరియు రూ.7.16 కోట్లు మంజూరు చేసింది. 

సమస్యలెప్పుడూ వుంటాయి

వక్ఫ్‌ ఆస్తులకు సంబంధించి సమస్యలు లేవని ఎవరూ అనరు. 1954లో మొట్టమొదటిసారి వక్ఫ్‌ చట్టాన్ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. అవసరాలకు తగిన రీతిలో లేదన్న కారణంగా 1995 లో దాని స్థానంలో మరో చట్టాన్ని తెచ్చినా ఇంకా సమస్యలు తీరకపోవడంతో మరిన్నిచర్యలు అవసరమన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమైన మాట వాస్తవం. వక్ఫ్‌ ఆస్తుల్లో దాదాపుసగం వరకు వాటి యాజమాన్యం లేదా నిర్వహణకు సంబంధించిన సమస్యలున్నాయి. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలతో పాటు పారదర్శకత లేదన్నది కూడా మరోఅభియోగం. మౌలికంగా వక్ఫ్‌ ఆస్తి అంటే ముస్లిం సంపన్నులు భక్తిభావంతో మతపరమైన అవసరాలకోసం, ఆ వర్గాల్లోని నిరుపేదల అభ్యున్నతికోసం దానంగా ఇచ్చే ఆస్తి. ఇప్పటివర కు కారుణ్య భావంతో ఇతర మతస్తులు కూడా వక్ఫ్‌కు తమ ఆస్తులను దానం చేయవచ్చునన్న నిబంధన వుండేది. తాజాగా పార్లమెంట్‌ ఆమోదించిన చట్టం ప్రకారం ఐదేళ్లు ఇస్లాంను పాటించిన వారు మాత్రమే దానం చేయడానికి అర్హులు. అయితే ఈ నిబంధన 2013కు ముందు వుండేది. కానీ కాంగ్రెస్‌ నేతృత్వంలోని యుపీఏ ప్రభుత్వం దీన్ని తొలగించింది. వక్ఫ్‌ ఆస్తుల్ని ఆర్నెల్లలోగా డేటాబేస్‌లో నమోదు చేయకపోతే వాటికి సంబంధించిన వివాదాలపై న్యాయస్థానాలను ఆశ్రయించడం అసాధ్యమని బిల్లు స్పష్టం చేస్తున్నది.ముఖ్యమైన విషయ మేంటంటే వివాదంలో పడిన వక్ఫ్‌ ఆస్తులపై ప్రభుత్వం నియమించిన ఉన్న తాధికారిదే తుదినిర్ణయమనేది ఈ బిల్లులో ప్రభుత్వం స్పష్టంగా పేర్కొనడం కీలకం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!