
RTC BC Association
దేశవ్యాప్త సమ్మెకు విజయవంతం చేయాలి*
ఆర్టీసీ బీసీ సంఘం నర్సంపేట డిపో అద్యక్షులు కందికొండ మోహన్
నర్సంపేట,నేటిధాత్రి:
కార్మిక హక్కులను కాపాడుకోవడానికి ఈ నెల 9 న దేశవ్యాప్తంగా తలపెట్టనున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను విజయవంతం చేయాలని సాధించుకోవాలని నర్సంపేట ఆర్టీసీ డిపో బీసీ సంఘం అద్యక్షులు కందికొండ మోహన్ పిలుపునిచ్చారు.అందుకుగాను సమ్మె వాల్ పోస్టర్లను డిపో ఆవరణలో శనివారం పలువురు ఆర్టీసీ నాయకులతో కలిసి మోహన్ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ దేశంలో బడా పెట్టుబడిదారుల కోసం కార్మికులను బలిస్తారా అని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇప్పటికైనా కేంద్రంలో ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్ లను వెంటనే రద్దు చేయాలని మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కాగా ఈ దేశవ్యాప్త సమ్మెలో నర్సంపేట ఆర్టీసీ డిపో కార్మికులు పాల్గొంటున్నట్లు ప్రకటించారు.ఈ కార్యక్రమంలో ఎస్ డబ్ల్యూఎఫ్ డిపో కార్యదర్శి ఓరుగంటి కొమ్మాలు, బాస్కర్, కే.ఎన్ గౌడ్, బాలరాజు కాసీం బీగం, సునిత తదితరురు పాల్గొన్నారు.