
దుగ్గొండి,నేటిధాత్రి :
జాతీయ మానవ హక్కుల కమిటీ ఆధ్వర్యంలో దుగ్గొండి మండల నూతన కమిటీ ఎన్నిక కాగా శనివారం ఎమ్మార్వోతో పాటు పలువురు అధికారులను మర్యాదపూర్వకంగా కలిశారు.జాతీయ మానవ హక్కుల కమిటీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుల్ల భద్రయ్య ఆదేశాల మేరకు గ్రేటర్ వరంగల్ ప్రధాన కార్యదర్శి కోమండ్ల శ్రీనివాస్ నియమించారు. ఈ సందర్భంగా దుగ్గొండి మండల జాతీయ మానవ హక్కుల కమిటీ ఎమ్మార్వో రవిచంద్ర రెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్లు,ఎంపీడీవో అరుంధతి, ఎంఈఓ శ్రీదర్ గౌడ్,ఏవో మాధవి, కరెంటు డిపార్ట్మెంట్ ఏఈలను మర్యాదపూర్వకంగా కలిశారు. దుగ్గొండి మండలంలోని ఆయా గ్రామాల్లో ఉన్న సమస్యలను ఆయా డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులకు తెలిపారు. ఈకార్యక్రమంలో దుగ్గొండి మండల అధ్యక్షులు మెరుగు రాంబాబు, ప్రధాన కార్యదర్శి ముత్యాల రాజు, జిల్లా ఉపాధ్యక్షులు కొమ్మల దిలీప్, మండల అధికార ప్రతినిధి వేముల రామచందర్, సంయుక్త కార్యదర్శి బొడిగె మోహన్,సహాయ కార్యదర్శి పేరబోయిన సురేష్, సోషల్ మీడియా మండల ఇన్చార్జ్ మంద రమేష్ మోర్తాల అఖిల్ తదితరులు పాల్గొన్నారు.