అధికారులు మౌనంగా ఉండడం వెనుక మతలభేంటి అని చర్చించుకున్న పట్టణ ప్రజలు
జమ్మికుంట (కరీంనగర్ జిల్లా), నేటిధాత్రి :
జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆర్ఓబి వంతెన క్రింద ఇష్టానుసారం తాత్కాలిక కట్టణాలు వెలుస్తున్నప్పటికి.. మున్సిపల్ శాఖ అధికారులు కానీ.. ఆర్ఓబి అధికారులు కానీ… చూచిచూడనట్లు వ్యవహరించడం పట్ల పలు విమర్షలు వ్యక్తమవుతున్నాయి. గత రెండు సంవత్సరాల క్రితం మున్సిపల్ అధికారులు ఆర్ఓబి వంతెన క్రింద సుందరికరణ ప్రదేశాలుగా మార్చేంచుకు ప్రత్యేక నిధులు కేటాయించామని అందుకు సంబంధించిన సర్వే కూడా పూర్తి చేశామని చెప్పినప్పటికీ.. అది హంసలోనే బాలరిస్టాలు తోలగకుండా పోయింది. పేపర్లో చెప్పుకోటానికే పరిమితమైంది తప్ప దాని పై మున్సిపల్ అధికారులు దృష్టి సారించకపోవడంతో.. దీనినే అదనుగా భావించిన పలువురు అక్రమార్కులు ఆర్ఓబి వంతె కింద ఉన్నటువంటి కాళీ ప్రాంతాలలో టేలాలను అక్రమంగా రాత్రికి రాత్రే నిర్మిస్తూ.. సదరు టేలాలను కిరాయికి ఇవ్వడం కూడా పరిపాటిగా మారింది. ఇంత జరుగుతున్న అటువైపు మున్సిపల్ శాఖ అధికారులు కన్నెత్తి కూడా చూడకపోవడం వెనుక పలు విమర్షలు వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ కి సంబంధించిన మున్సిపల్ అధికారులే అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారి వద్ద ముడుపులు తీసుకుంటున్నారని పట్టణానికి చెందిన పలువురు సామాజికవెత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్జాగా డబ్బా వెలువడడమే కాకుండా సదరు డబ్బాలలో విద్యుత్ సౌకర్యం కూడా ఉంటుండడంతో… విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం పై కూడా అగ్రహజ్వాలల వ్యక్తమవుతున్నాయి. మున్సిపల్ నిబంధనలు ప్రకారం అక్రమంగా కట్టడాలు వెలిసిన సమయంలో సంబంధిత అధికారులకు సైతం ఫిర్యాదులు వెల్లగానే తక్షణమే స్పందించి తోలగించాల్సినటువంటి అధికార యంత్రాంగం ఈ తతంగం జరుగుతున్నప్పటికీ నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరించడం చూస్తుంటే… భారీ స్థాయిలో ముడుపులు చేతులు మారాయననే ఆరోపణలకు బలం చేకూరుస్తుంది. ఇప్పటికైనా సంబంధిత ఆక్రమ కట్టడాలపై మున్సిపల్ శాఖ అధికారులు ఉక్కు పాదం మోపి.. వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉందనీ స్థానిక ప్రజలు కోరుతున్నారు. దుకాణాలలోకి పలువురు ఆవసరం నిమిత్తం వచ్చి వస్తువులు కొనుగోలు చేసేవారికి వాహనాలు పెట్టుకోనేందుకు ఇబ్బందులు ఎదురవుతున్న దృశ్య.. పట్టణంలో ట్రాఫిక్ సమస్య నియంత్రించాలంటే అక్రమంగా ఆర్ఓబి వంతెన కింద నిర్మాణం చేపడుతున్నటువంటి కట్టడాలను కూల్చి వేస్తే కొంత ట్రాఫిక్ సమస్య నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని మేధావి వర్గం సైతం చెప్తున్నారు. ఇట్టి విషయం పై మున్సిపల్ శాఖ స్పందిచాల్సిన అవసరం ఎంతైన ఉందని పట్టణ ప్రజలు కోరుతున్నారు. ఇట్టి విషయం పై ” నేటిధాత్రి ” ప్రతినిధి మున్సిపల్ కమీషనర్ ను వివరణ కోరగా.. దాటవేసే దొరణిలో మాట్లాడడమే కాకుండ సరైన స్పందన ఇవ్వకపోవడం చూస్తుంటే.. ఆయన విధుల పట్ల ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడనడానికి నిదర్శనంగా నిలుస్తుంది.