
మహబూబ్ నగర్ జిల్లా :: నేటి ధాత్రి
మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మున్సిపల్ పరిది 23 వ వార్డు కౌన్సిలర్ ఉమాశంకర్ గౌడ్ తండ్రి వల్లబ్ దాస్ నరసింహులు గౌడ్ అకస్మత్తుగా నిన్న మరణించడం జరిగింది, విషయం తెలిసిన మున్సిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి దోరేపల్లి లక్ష్మీ రవీందర్ వారి ఇంటికి వెళ్ళి పార్థివ దేహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు.మరియు మున్సిపల్ కౌన్సిలర్స్, నాయకులు తదితరులు పాల్గొని పార్థివ దేహానికి నివాళులర్పించారు.