
RTI board
దృశ్య రూపంలో సక్రమంగా కనిపించని ఎంపీడీవో కార్యాలయం బోర్డు…
తహాసిల్దార్ కార్యాలయంలో సమాచారం లేని ఆర్.టి.ఐ బోర్డు…
ఆర్టిఐ అంశాల అర్జీలు ఎవరికి పెట్టుకోవాలో తెలియని గందరగోళంలో ప్రజలు…
నేటి ధాత్రి -గార్ల :-
గార్ల మండల కేంద్రంలోని స్థానిక తహసిల్దార్ కార్యాలయం లో ప్రజలు తమ సమస్యల పైన అర్జీలు పెట్టడానికి వచ్చినవారికి సమాచారం లేని ఆర్టిఐ బోర్డు దర్శనమిస్తుంది.ఆర్టిఐ బోర్డులో ఎటువంటి సమాచారం లేకపోవడంతో ప్రజలు ఎవరికి అర్జీలు పెట్టుకోవాలో తెలియని పరిస్థితి గోచరించింది.ఎంపీడీవో కార్యాలయం బోర్డు మీద కార్యాలయం పేరు సరిగ్గా కనిపించని పరిస్థితి ఉన్నది.సుదూర ప్రాంతాల నుండి మండల కేంద్రానికి వివిధ అభివృద్ధి పనుల కోసం వచ్చే ప్రజలకు కనీసం కార్యాలయ బోర్డు కనిపించకపోతే ఎలా?అని మండల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ప్రజల సౌకర్యార్థం జిల్లా అధికారులు స్పందించి ఎంపీడీవో కార్యాలయం బోర్డు ఏర్పాటు చేయాలని,తహసీల్దార్ కార్యాలయంలో ఆర్టిఐ బోర్డు లో సమాచారం పొందుపరిచే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు,ప్రజా సంఘాలు,విద్యావంతులు, మేధావులు కోరుతున్నారు.