
P. Ramulu: Pre-Arrests Cannot Stop the Protest
ముందస్తు అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరు,
◆:- పి.రాములు నేత
జహీరాబాద్ నేటి ధాత్రి:
జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు
యావత్తు తెలంగాణ సమాజం రోడ్లపైకి రాకముందు కల్తీ నకిలీ వ్యాపారాలను పరిశ్రమల కాలుష్యాన్ని కార్మికులపై మోసాలను ప్రభుత్వాలు అధికార యంత్రాంగం తో పూర్తిగా అరికట్టాలి
తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర భారతదేశం నుండి వచ్చిన వర్తకులు పరిశ్రమల పెట్టుబడిదారులు తెలంగాణ ప్రాంతంలో నాణ్యతలేని తినుబండరాలను నకిలీ వస్తువులను విక్రయిస్తూ తెలంగాణ ప్రజలను పూర్తిగా మోసానికి గురి చేస్తున్నారు వీరి బారిన పడి అనేక మంది ప్రజలు తమ ఆరోగ్యాలు కాకుండా ఆర్థికంగా నష్టపోతున్నారు ఈ ప్రాంతంలో పెట్టుబడిదారులుగా వచ్చిన పారిశ్రామికవేత్తలు పారిశ్రామాలు నెలకొల్పి కార్మిక చట్టాలను పూర్తిగా తుంగలో తొక్కి తెలంగాణ ప్రాంతంలోని నవయువ కార్మికులతో వెట్టిచాకిరి చేయించుకొని వారికి సరిపడా వేతనాలు ఇవ్వకుండా సరైన సౌకర్యాలు కల్పించకుండా వారి ఆరోగ్యాలను సమయాన్ని ఆర్థిక పరిస్థితులను నిలువున దోచుకుంటున్నారు కర్మ గారాల యజమాన్యాలు మన గడ్డమీద టికానపెట్టి మన ప్రాంతంను కాలుష్యంతో నింపి వేస్తున్నారు వీరి బారిన పడి ప్రజలు అనేక సందర్భాల్లో అనారోగ్యం పాలవుతున్నారు ఈ విషయాలపై జాగో తెలంగాణ రాష్ట్ర వ్యవస్థాపకులు పి.రాములు నేత తేదీ 22 -8 -2025 నాడు జహీరాబాద్ బందుకు పిలుపునివ్వగా జహీరాబాద్ పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి జహీరాబాద్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లారు బందు పిలుపును అడ్డుకున్నారు కార్యక్రమంలో జాగో తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మహమ్మద్ ఇమ్రాన్ మాదినం శివప్రసాద్ ప్యార్ల దశరథ్ జహీరాబాద్ కిరాణా వర్తక సంఘం అధ్యక్షులు సంతోష్ ముందస్తుగా అరెస్టు చేసి సొంత పూచికతపై వదిలిపెట్టారు,