
కమలాపూర్ మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి సందర్శించారు. ఆసుపత్రిలో అడ్మిట్ అయి ఉన్న రోగుల వద్దకు వెళ్లి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని సరైన వైద్యం అందుతుందా అని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేయడానికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు ఉన్నంతలో మెరుగైన వైద్యం అందించాలని కోరారు.