నేటి ధాత్రి:వీణవంక
వీణవంక మండల పరిధిలోని ఎల్బాక గ్రామంలో బీ ఆర్ఎస్ పార్టీ కార్యకర్త మద్దెల రవి మరణించిన విషయం తెలియగానే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎలబాక గ్రామానికి వెళ్లి వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అలాగే వివిధ కారణాల వల్ల మృతి చెందిన కుటుంబాలను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.వీరి వెంట సొసైటీ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి, కొత్తిరెడ్డి కాంతారెడ్డి, కోట శ్రీనివాస్ రెడ్డి, బీఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు తదితరులు ఉన్నారు.