హసన్ పర్తి / నేటి ధాత్రి
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 1వ డివిజన్ పరిధిలోని పెగడపల్లి గ్రామంలో అనారోగ్యంతో మరణించిన గొల్లెల మహేందర్ భౌతిక దేహానికి పూలమాల వేసి నివాళులర్పించి వారి కుటుంబసభ్యులను పరామర్శించి అనంతరం అదే గ్రామానికి చెందిన గండ్రతి భాగ్య గారు ఇటీవల అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులకు పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసి అనంతరం 2వ డివిజన్ పరిధిలో గుండ్లసింగారం గ్రామంలో మదాసి సారయ్య ఇటీవల అనారోగ్యంతో బాధపడుతు మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు. అలాగే హాసన్ పర్తి మండల అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, హనుమకొండ మండల అధ్యక్షుడు మదాసి అజయ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తంగెళ్ళ తిరుపతి గౌడ్, డివిజన్ అధ్యక్షుడు పొన్నాల రఘు, వర్ధన్నపేట సోషల్ మీడియా ఇంఛార్జి పుట్ట తిరుపతి, హాసన్ పర్తి మండల యూత్ అధ్యక్షుడు సౌరం చరణ్ రవి, తో పాటు తదితరులు పాల్గొన్నారు.