వేములవాడలో నడిరోడ్డుపై కూర్చుని ధర్నా చేసిన ఎమ్మెల్యే

-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

-ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్ర బిజెపి సర్కార్ నిర్వీర్యం చేస్తుందని విమర్శలు

-వచ్చే ఎన్నికల్లో బిజెపి సర్కార్ కు ప్రజలే వారి ఓట్లతో తగిన బుద్ధి చెబుతారు

-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

వేములవాడ, నేటిధాత్రి:
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకొని నిర్వీర్యం చేస్తుందని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ అన్నారు.. గురువారం కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఏఐసీసీ,పీసీసీ ఇచ్చిన పిలుపుమేరకు వేములవాడ పట్టణంలోని ఎస్బిఐ శాఖ ముందు మహాధర్నా కార్యక్రమాన్నీ నిర్వహించారు.

వారు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఇటీవల బీజేపీ యొక్క ఎలక్టోరల్ బాండ్ పథకాన్ని రాజ్యాంగ విరుద్ధమని భావించి నిషేధం విధించిందని అన్నారు.

ఈ పథకం ద్వారా స్వీకరించిన విరాళాలను బహిర్గతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలకు ఎన్నికల విరాళాలపై పూర్తి సమాచారాన్ని మార్చి 6 లోపు బహిరంగపరచాలని, ఎన్నికల కమిషన్‌కు సమర్పించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)ని కోర్టు ఆదేశించిందని కానీ దానికి అనుగుణంగా నడుచుకోవాల్సిన బిజెపి ప్రభుత్వం దాతల గురించిన సమాచారం పబ్లిక్‌గా ఇస్తే,కార్పొరేట్‌లతో తన సంబంధాలను బహిర్గతం అవుతుందని భయపడుతుందన్నారు.

బీజేపీ ఆందోళన చెందుతూ ఎలక్టోరల్ బాండ్
సమాచారాన్ని పంచుకోవద్దని మోడీ ప్రభుత్వం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాపై ఒత్తిడి తెస్తూ పెత్తనం చెలయిస్తోందని అన్నారు.

కోర్టు నిర్ణయంతో ఎన్నికల్లో నల్లధనానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక చర్యగా ఈ నిర్ణయం దేశవ్యాప్తంగా అన్ని రాజకీయ పార్టీలు స్వాగతించాయి అన్నారు.

ఎలక్టోరల్ బాండ్ పథకం ప్రవేశపెట్టినప్పటి నుండి బీజేపీ పార్టీ ఒక్కటే 26,566.11 కోట్లను అందుకుంది,ఇది మొత్తం ఎలక్టోరల్ బాండ్లలో 55% ఉందన్నారు.

ఎలక్టోరల్ బాండ్ వివరాలను పంచుకోవడానికి జూన్ వరకు పొడిగించాలని కోరుతూ ఎస్బిఐతో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు వేయించిందన్నారు.

భాజపా ఆర్థిక అవకతవకలను, నల్లధనం మూలాన్ని దాచిపెట్టేందుకు ఎస్‌బీఐని బిజేపి ప్రభుత్వం ఉపయోగించుకుంటుందని ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ, ప్రభుత్వ రంగ సంస్థలను తన గుప్పిట్లో పెట్టుకున్న బిజెపి ప్రభుత్వానికి ప్రజలు తప్పకుండా గుణపాఠం చెప్తారని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!