మూడవరోజు కొనసాగుతున్న ఎమ్మెల్యే పెద్ది ఎన్నికల ప్రచారం

# నాకు ఆస్తులు పాస్తులు లేవు నా బలం నా ప్రజలే..

# రాత్రికి రాత్రి ఒక్కటయ్యే మోసగాళ్ల మాటలు నమ్మొద్దు..

# పాకాలకు గోదారి నీళ్లు తెస్తానన్న నాయకుల మాటలు ఏమయ్యాయి.

# హామీలు నెరవేర్చని కాంగ్రెస్ నాయకుల్లారా ఏ ముఖంతో ఓట్లకస్తున్నారు.

# నాకు రాజకీయాలు వద్దు.. ప్రజా రైతు సంక్షేమ నా ధ్యేయం..

# కారుగుర్తుకు ఓటేస్తే.. మీ చేను చెలకకు వేసినట్లే.

# రెట్టింపు ఉత్సాహంతో దూసుకెళ్తున్న బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

# అడుగడుగునా మంగళహారతులతో మహిళల నీరాజనాలు..

నర్సంపేట, నేటిధాత్రి :

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కెసిఆర్ ప్రభుత్వంలో నర్సంపేట నియోజకవర్గం అనేక రైతు సంక్షేమ పథకాలను తీసుకచ్చాను. ప్రజల అవసరాల కోసం ఎన్నడు కానరానుడు ఓట్ల కోసం వస్తున్నారు. ప్రజలకు అభివృద్ధి చేసింది ఎవరు తెలుసు. ప్రజల కోసం స్థానికంగానే అందుబాటులో ఉంటూ అభివృద్ధి కోసం నిత్యం సేవలు చేసిన వ్యక్తిని అని తెలుపుతూ జరగబోయే ఎన్నికలలో కారు గుర్తుకు ఓటు వేస్తే మీ చేను చెలక, పాకాల,దేవతలకు,ఈ ప్రాంత పశుపక్షాదులకు ఓట్లు వేసినట్లే అని బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు. కొద్దిరోజుల్లో జరగబోయే శాసనసభ ఎన్నికల దృశ్య నర్సంపేట నియోజకవర్గం టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఎన్నికల ప్రచారం సోమవారం నాటికి మూడవరోజు చేరుకున్నది. తన సొంత గ్రామం నల్లవెల్లి మండలంలో మొదటి రోజు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టగా రెండవ రోజు నర్సంపేట మండలం పరిధిలో నిర్వహించారు. మూడవరోజు ఖానాపురం మండలంలోని రంగాపురం గ్రామంలో ప్రారంభించి కొత్తూరు మీదుగా 13 గ్రామాలలో బుధరావుపేట వద్ద ముగించారు. ఈ నేపథ్యంలో గ్రామ గ్రామాన, వాడవాడనా మహిళలు ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి బతుకమ్మలు, బోనాలు,మంగళహారతులతో నీరాజనాలు పలికారు. ఎన్నికల ప్రచారంలో గ్రామంలో ఏ వాడ ఏ గల్లి చూసిన గులాబీమయం కావడంతో ఎన్నికల ప్రచారం రెట్టింపు ఉత్సాహంతో ముందుకు సాగుతున్నది.
ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో నిర్వహించిన ఎన్నికల ప్రచారాలలో ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. నాకు ముందు వెనక ఎవరు లేరు. నా ప్రజలే నాకు బలం. నా పైన ముఖ్యమంత్రి కెసిఆర్ ఉంటే నా ముందు మీరే ఉన్నారని పేర్కొన్నారు. అన్ని గ్రామాల అభివృద్ధి పూర్తిస్థాయిలో చేశానని తెలుపుతూ నాకంటే ముందు పాలించిన ఓంకార్ నుండి ఎంతోమంది ఎమ్మెల్యేలను చూశారు అప్పుడు వారు చేసిన పనులు నేను చేసిన అభివృద్ధిని ప్రత్యక్షంగా చూశారు నియోజకవర్గంలో ఇంకా కొద్దిగా చేయాల్సిన అభివృద్ధి ఉన్నది అది జరగాలంటే మరల నేను రావాల్సిందే అంటూ అభివృద్ధి చేసిన మీ బిడ్డను మరోసారి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే పెద్ది వేడుకున్నారు. గతంలో పాలించిన తెదేపా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో పాకాల సరస్సుకు పంది పంపుల వాగు నుండి నీళ్లు తెస్తా అని ఒకరు గోదావరి నీళ్లు తెస్తానని మరొకరు శపదాలు చేశారని, వారు నెరవేర్చని పాకాల చెరువును కళలను గోదావరి జలాలతో నింపి రైతుల పాదాలు కడిగానని పేర్కొన్నారు. అది ఓర్వలేని ఆ ఇద్దరు నాయకులు రాత్రికి రాత్రే ఒక్కటై కుట్రలు చేస్తున్నారని దొంతి మాధవరెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి లపై ఆయన విమర్శలు చేశారు. నియోజకవర్గ ప్రజలకు మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ నాయకుల్లారా ఏ ముఖం పెట్టుకుని నాపై పోటీకి దిగావో చెప్పాలని డిమాండ్ చేశారు. నాకు రాజకీయాలు వద్దు ప్రజా సంక్షేమం నా ధ్యేయం, రైతు సంక్షేమం కోసం పనిచేస్తున్న, పార్టీలకతీతంగా ప్రతీ ఒక్కరికీ అనేక సంక్షేమ పథకాలను అందించిన వ్యక్తిని నియోజకవర్గంలో వందల కోట్లతో అభివృద్ధి చేస్తున్న కొన్ని పనులు పూర్తికాలేదు అందుకే నేను మరోసారి వస్తేనే అభివృద్ధి 100 శాతం పూర్తవుతుందని నాకు మరోసారి అవకాశం ఇవ్వండి అంటూ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ప్రజలను కోరారు. ఈ ప్రచార కార్యక్రమాలలో ఓడిసిఎంఎస్ చైర్మన్ రామస్వామి నాయక్, ఎంపీపీ వేములపల్లి ప్రకాష్ రావు నియోజకవర్గ యూత్ కన్వీనర్ డాక్టర్ గోగుల రానా ప్రతాప్ రెడ్డి, జెడ్పిటిసి బత్తిని స్వప్న శ్రీనివాస్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షుడు, పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *