చిట్యాల, నేటి ధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని దూత్ పల్లి, ఒడితెల, పాశిగడ్డతండ, కొత్తపేట, బావుసింగ్ పల్లి, జడల్ పేట, వరికోల్ పల్లి, ముచినిపర్తి, చల్లగరిగ, చిట్యాల, చింతకుంటరామయ్యపల్లి, గోపాలపురం గ్రామాలల్లో మంగళవారం రోజున భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎం జి ఎన్ ఆర్ ఐ ఈజీఎస్ నిధుల కింద మొత్తం రూ.2.5 కోట్లతో సిసి రోడ్లు, నూతన గ్రామ పంచాయతీ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేయడం జరిగింది, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల సంక్షేమ ప్రభుత్వం అని అన్నారు, ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు గూట్ల తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి దొడ్డి కిష్టయ్య, ఎంపీడీవో రామయ్య మండల అధికారులు మరియు కాంగ్రెస్ గ్రామ నాయకులు ఎంపిటిసిలు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.