
Temple
అద్భుత నిర్మాణం కోటగుళ్లు ఆలయం
ఆలయ శిల్ప సంపద భావితరాలకు అందించాలి
తెలంగాణ స్టేట్ ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి
ఆలయ సందర్శన స్వామివారికి ప్రత్యేక పూజలు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రంలో కాకతీయులు నిర్మించిన కోట గుళ్ళు ఆలయ నిర్మాణం ఎంతో అద్భుతమని తెలంగాణ స్టేట్ ఏసీబీ డైరెక్టర్ తరుణ్ జోషి అన్నారు.
మంగళవారం ఆయన శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోట గుళ్ళ ను సందర్శించారు.
ఈ సందర్భంగా కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారికి ఘన స్వాగతం పలికారు.
మొదట గణపతి, నందీశ్వర గణపేశ్వర స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పూజా కార్యక్రమాలు అనంతరం ఆలయ కమిటీ పక్షాన శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
పూజా కార్యక్రమాల అనంతరం ఆయన ఆలయ ప్రాంగణాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామప్ప శిల్ప సంపదని పోలిన విధంగా కోటగుళ్లు ఎంతో అద్భుతంగా ఉన్నాయని తను వరంగల్ లో పని చేసిన సమయంలో ఎప్పుడు ఇక్కడికి రాలేదని ఈ ఆలయంలో పూజలు జరుగుతున్న విషయం తమకు తెలియదన్నారు.
మొట్టమొదటిసారి ఆలయాన్ని సందర్శించడం జరిగిందని ఇక్కడి వాతావరణం తనకెంతో నచ్చిందని అన్నారు.

కాటేశ్వరాలయం నందిమండపం నాట్య మండపాలను ప్రత్యేకంగా పరిశీలించారు. సుమారు గంటపాటు ఆలయ ప్రాంగణంలోనే గడిపారు.
అనంతరం హరిత అతిథి గృహం ప్రాంగణంలో ఉన్న శివ ద్వారా పాలక విగ్రహాలను పరిశీలించారు.
మరోసారి కుటుంబ సమేతంగా ఆలయాన్ని సందర్శిస్తారని అన్నారు.
ఆయన వెంట చిట్యాల సిఐ మల్లేష్, భూపాలపల్లి సిఐ దొమ్మాటి నరేష్ కుమార్ గౌడ్ గణపురం ఎస్ఐ రేఖ అశోక్ తదితరులు ఉన్నారు.