గుండాల(భద్రాద్రికొత్తగూడెం జిల్లా),నేటిధాత్రి :
నాలుగు లేబర్ కోడుల మూడు నేర చట్టాల సవరణ రద్దు కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ స్క్రీ కార్మికులకు కనీస వేతనం 26వేల కై అసంఘటిత రంగ కార్మికులక సమస్యల పరిష్కారం కై శనివారం గుండాల మండలం కాచనపల్లి గ్రామ సెంటర్లో పోస్టర్ ఆవిష్కరణ చేశారు.అనంతరం ఐఎఫ్టియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నాయకులు యనగంటి రమేష్ మాట్లాడుతూ
బిజెపి మోడీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేసింది.స్వదేశీ జాతీయత దేశభక్తి పేరుతో ప్రభుత్వ రంగ సంస్థలను ఆస్తులను సహజ వనరులను ఖనిజ సంపదను సంస్థలకు అమ్మి వారి ఆస్తులు సంపదను పెంచింది.
కేంద్రం బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి బొగ్గు గనులతో సహా అన్ని రకాల గనులను వేలంపాటలు పెట్టి ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తున్నారు. బ్రిటిష్ కాలం నాటి వలసవాద చట్టాలను సవరించి పౌరులకు స్వేచ్ఛ సత్వరం న్యాయం చేస్తామని మూడు నేర చట్టాలను సవరించి జూలై 1. 2024 నుండి అమలు చేస్తున్నది ఈ నేరచట్టాలలో 90 శాతం యధాతధంగా ఉంచి పేరు మార్చి సెక్షన్లు మార్చింది. వలసవాద చట్టాల కంటే మరింత ప్రమాదంగా స్వరాధికారాలుగా పోలీస్ యంత్రాంగానికి ఇచ్చింది పౌరుల సంఘాల ప్రశ్నించే గొంతుకల పార్టీలపై ఉక్కు పాదం మోపి అణచివేసే విధంగా ఈ చట్టాలను సవరించింది
ప్రభుత్వ రంగ సంస్థలలో పర్మినెంట్ కార్మికులను తగ్గించి కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులను నియమిస్తున్నారు.సమాన పనికి సమాన వేతనం లేదు కనీస వేతనం అమలు జరగడం లేదు. ఇతర చట్టబద్ధ హక్కులు లేవు. ఆశ అంగన్వాడి మధ్యాహ్నం భోజనం కేజీబీవీ తదితర ప్రభుత్వ సంస్థలలో పనిచేస్తున్న కార్మికులను వెట్టిచాకిరితో పనిచేస్తున్నారు.వీటన్నిటి అమలుకై ఈనెల 30న హైదరాబాదులోని ఇందిరాపార్క్ వద్ద జరుగు మహాధర్నకు కార్మిక వర్గం అధిక సంఖ్యలో పాల్గొని వాటి అమలుకై పోరాటపటిమను రూపొందించుకొని భవిష్యత్ కార్యాచరణ పోరాటాల ద్వారా సాధించుకునే విధంగా అందరూ హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచారు.
ఈ కార్యక్రమంలో మోటార్ కార్మికులు మందపురి శ్యామ్,రంగు రాము, పూణెం రమేష్,గ్రామపంచాయతీ కార్మికులు ఎరకల సురేష్,రాపోలు కృష్ణ తదితరులు పాల్గొన్నారు.