ఎగ్జామినేషన్ బ్రాంచ్ కంట్రోలర్ గేటు ముందు ధర్నాకు దిగిన విద్యార్థులు
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హన్మకొండ జిల్లా అధ్యక్షులు :ఎల్తూరి సాయికుమార్ స్వేరో
హన్మకొండ,నేటిధాత్రి
స్వేరో స్టూడెంట్స్ యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఎల్తూరి సాయికుమార్ మాట్లాడుతూ కాకతీయ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ విద్యార్థులు ఒక ఇయర్లో మూడు లేదా నాలుగు సబ్జెక్టులు ఫెయిల్ అయినచో డి టెన్షన్ అనే పద్ధతిని కంటిన్యూ చేస్తున్నారు కావున ఎంతోమంది పేద విద్యార్థులకు నష్టం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క డి టెన్షన్ అనే పద్ధతిని ఎత్తివేయాలని అన్ని కాలేయల తరఫునుంచి భారీ ఎత్తున విద్యార్థులు హాజరై కాకతీయ యూనివర్సిటీ ఎగ్జామినేషన్ బ్రాంచ్ కంట్రోలర్ గేటు ముందు స్వేరో స్టూడెంట్స్ యూనియన్ అనుమకొండ జిల్లా ఆధ్వర్యంలో ధర్నాకు దిగడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కిరణ్, చెట్టుపల్లి శివకుమార్ ,సిద్దు ,అనుఫ్ ,రాజ్ కుమార్, వెంకటేష్ ,రఘురాం ,రాకేష్ ,భారత్ ,వినీత్ ,ఉదయ్ , కృష్ణ ,సాత్విక్ ,రాజేష్, సుఖేష్, నవీన్, సుఖేష్ తదితరులు పాల్గొన్నారు.