విద్యాసంస్థలతో కుమ్మకై ఎటువంటి వసతులకు లేకున్నా చూస్తూ పట్టించుకోవడం లేదు
సమాచార హక్కు చట్టాన్ని తుంగలో తొక్కి సమాచారం ఇవ్వడం లేదు
* ఎంఈఓ కార్యాలయం ముందు నిరసన*
ఏ.ఐ.ఎస్.బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు
చేర్యాల నేటిధాత్రి..
చేర్యాల మండల కేంద్రంలో ఉన్నటువంటి స్థానిక మండల విద్యాశాఖ అధికారి కార్యాలయం ముందు విద్యాసంస్థలకు సంబంధించినటువంటి 2005 సమాచార హక్కు చట్టం ప్రకారం సమాచారాన్ని ఇవ్వకుండా విద్యా సంస్థలతో కుమ్మక్కై ఇష్టనుసారంగా వ్యవహారుస్తున్నాడని విద్యాశాఖ అధికారి నర్సింహారెడ్డి ని విధుల నుంచి తొలగించాలని ఎంఈఓ కార్యాలయం ముందు నిరసన తెలియజేయడం జరిగిందని ఏఐఎస్బి జిల్లా అధ్యక్షులు పుల్లని వేణు డిమాండ్ చేశారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. గత జూలై నెలలో 2005 సమాచార హక్కు చట్టం కింద ఒక పాఠశాలకు సంబంధించినటువంటి బస్సుల ఫిట్నెస్ మరియు డ్రైవర్ల అర్హత, పాఠశాలలో పనిచేసేటువంటి ఉపాధ్యాయుల అర్హతలు, పాఠశాల విస్తీర్ణం మరియు ఫైర్ సేఫ్టీ సంబంధించినటువంటి వాటి పూర్తి సమాచారం ఇవ్వగలరని సమాచార హక్కు చట్టం ద్వారా కోరడమైనది . కానీ స్థానిక ఎంఈఓ రెండు నెలలు కావస్తున్నా ఇంతవరకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా పాఠశాలతో కుమ్మక్కై పాఠశాలలో తగిన వస్తువు లేకుండా, అధిక ఫీజులు వసూలు చేస్తున్న పట్టించుకోవట్లేదని జిల్లా విద్యాశాఖ అధికారి వెంటనే చొరవ తీసుకొని మండల విద్యాశాఖ అధికారిని విధుల నుంచి తొలగించాలని ఏఐఎస్బిగా డిమాండ్ చేస్తున్నాం, లేనియెడల డిఈఓ కార్యాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు వెల్ది సాయికిరణ్ రెడ్డి, నాగపురి స్వామి, సందీప్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు.