సర్కులర్లు, అగ్రిమెంట్లను తిరస్కరిస్తూ కార్మికులకు అన్యాయం చేస్తున్న యాజమాన్యం

అవినీతికి కేంద్ర బిందువుగా జీఎం ఆఫీస్

ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి రమేష్

భూపాలపల్లి నేటిధాత్రి

భూపాలపల్లి సింగరేణి అధి కారులు కార్మిక సంఘాలతో చేసుక్ను అగ్రిమెంట్లను, వాటి అమలు ఉన్నత స్థాయి యాజమాన్యం జారీచేసిన సర్క్యులర్ అని అమలు చేయడానికి ఉద్దేశం పూర్వకంగా తిరస్కరిస్తున్నారని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ భూపాలపల్లి బ్రాంచ్ కార్యదర్శి మోట పలుకుల పలుకుల రమేష్ విమర్శించారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని స్థానిక ఏఐటీయూసీ కొమురయ్య భవన్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేటీకే ఓ సీ2 గనిలో పనిచేస్తున్న అయిత రవీందర్ రెడ్డి అనే కార్మికుడు జేబీసీసీఐ అగ్రిమెంట్ కు అనుగుణంగా తన పుట్టిన తేదీని సవరించాలని కోరుతూ 2012 సంవత్సరం నుండి స్థానిక యాజమాన్యంతో పోరాడుతున్నాడని అన్నారు. 2013 లో అతన్ని ఏరియా ఏజ్ అసిస్మెంట్ కమిటీ పిలిచి అతని ఎస్ఎస్సి సర్టిఫికెట్ వాస్తవికత నిర్ధారించిన ఇప్పటిదాకా అతని పుట్టిన తేదీ ఎస్ఎస్సి ప్రకారం సర్కులర్కు అనుకూలంగా మార్చలేదని రమేష్ విమర్శించారు. ఇలాంటి కార్మిక వ్యతిరేక చర్యలకు నిరసనగా కార్మికులు లక్షలాది రూపాయలు ఖర్చు చేసి కోర్టు మెట్లు ఎక్కుతున్నారని అన్నారు. అయిత రవీందర్ రెడ్డి కేసు అతని దృష్టికి వచ్చిన వెంటనే విషయాన్ని ఏరియా కార్పొరేట్ అధికారుల దృష్టికి తీసుకువెళ్లి రిప్రజెంట్ చేయగా నిబంధనల ప్రకారం ఏరియా ఏజ్ అసెస్మెంట్ కమిటీ ద్వారా రిపోర్టు పంపాలని జిఎం పీఆర్ డిసెంబర్ 2023 లో ఆదేశాలు ఇచ్చిన స్థానిక అధికారులు సర్కులర్కు అనుగుణంగా రిపోర్టు పంపకుండా సర్టిఫికెట్ ప్రకారం ఏజి చేసి పంపకుండా సర్కులర్ కు భిన్నంగా పంపి అన్యాయం చేసే దురుద్దేశంతో ఉన్నారని ఆయన అన్నారు. అట్లాగే డిపెండెంట్ ఎంప్లాయిమెంట్ ప్రారంభమైన తరువాత భూపాలపల్లిలో విపరీతమైన అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని దానికి జిఎం ఆఫీస్ కేంద్ర బిందువుగా మారిందని రమేష్ ఆరోపించారు. సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *