
Villagers Protest Hazardous Madri Road in Warangal
మద్రి రోడ్డును బాగు చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలి.
జహీరాబాద్ నేటి ధాత్రి:
కోహిర్ మండలంలోని మద్రి నేషనల్ హైవే రోడ్డు నుండి మద్రి గ్రామానికి వెళ్లే రోడ్డు అత్యంత దారుణంగా ప్రమాదకరంగా తయారయింది. గుంతలమయంతో అనునిత్యం ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాలను అరికట్టాలని రోడ్డుకు మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ యువత ఆధ్వర్యంలో రోడ్డుపై నిలిచిన పెద్ద పెద్ద గుంతలలోని నిండిన నీళ్ల దగ్గర ఉండి నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనునిత్యం మద్రి నుండి జహీరాబాద్ వెళ్లడానికి వివిధ పనుల కోసం వెళ్లే వారికి స్కూలు విద్యార్థులకు పరిశ్రమ కార్మికులకు రాత్రివేళలో ఉదయం పూట వెళ్లే సందర్భంగా అనేక మంది తీవ్రమైనటు వంటి ఇబ్బందులకు గురవుతున్నారని ఇట్టి రోడ్డును మరమ్మత్తులు చేయాలని డిమాండ్ చేసినారు. ఇంత పెద్ద గుంతలు పడి బండ్లు కొన్ని సందర్భాలలో కింద పడిపోయిన ఘటనలు ఉన్నాయని చిన్న వెహికల్ పై వెళ్లే వారికి పెద్ద వాహనాలు వచ్చినప్పుడు ఎటుపోవాలని కూడా తెలియనటువంటి పరిస్థితి ఉందని రోడ్డులో నడిచే వారికీ ఈ దారిన వెళ్లే వారికి భయపడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయని వీటిని వెంటనే సరి చేయకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని అన్నారు. రోడ్లు భవనాల శాఖ అధికారులు జహీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నారా అని ప్రశ్నించారు. ప్రజల ప్రాణాలు కాపాడడానికి ఇంత దారుణంగా రోడ్డు తయారైన ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం చూస్తే ఆ శాఖ ఉన్నట్టు కనిపించడం లేదని ఉంటే వెంటనే మరమ్మత్తులు చేసి ప్రజలు వెళ్లడానికి ఇబ్బందులేని పరిస్థితులు కల్పించాలని డిమాండ్ చేసినారు. లేనిపక్షంలో రోడ్లు భవనాల శాఖను ముట్టడిస్తామని హెచ్చరించినారు. ఈ కార్యక్రమంలో నాయకులు వినయ్ కుమార్, నిజమోద్దీన్, మోసిన్,రిజ్వన్,చోటు, షకీల్, ప్రసాద్, అంజన్న తదితరులు పాల్గొన్నారు.