ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద.
నర్సంపేట,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఎల్ఆర్ఎస్ ప్రక్రియను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదేశించారు.
గురువారం నర్సంపేట మున్సిపల్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి ఎల్ఆర్ఎస్ క్రింద క్రమబద్దీకరణకు చేపడుతున్న కార్యక్రమాలను కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 26 ఆగస్టు 2020 కు ముందు రిజిస్ట్రేషన్ అయిన ప్లాట్లు, లే అవుట్ల క్రమబద్ధీకరణ ఈ నెల 31 తో ముగుస్తున్నందున దరఖాస్తుదారులు త్వరితగతిన ఫీజు చెల్లించి 25 శాతం రిబెట్ పొందవచ్చని తెలిపారు.
ఈ సందర్భంగా ప్లాట్ల క్రమబద్దీకరణకు వచ్చిన దరకాస్తుదారులతో కలెక్టర్ నేరుగా మాట్లాడి ఏమైనా సమస్యలు ఉన్నాయా అని ఆడిగి తెలుసుకొగా అధికారులు బాగా స్పందిస్తున్నారని వారు తెలిపారు.
నర్సంపేట మున్సిపల్ పరిధిలో 5732 మంది దరకాస్తూ చేసుకోగా 2271 క్రమబద్దీకరణకు మంజూరు చేయగా, 293 మంది ఫీజు చెల్లించారని,186 మందికి క్రమబద్దీకరణ పత్రాలు అందజేయడం జరిగిందని అధికారులు కలెక్టర్ కు తెలిపారు.
ఈ సదావకాశాన్ని వినియోగించుకొని దరఖాస్తు దారులు సకాలంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ చేయించుకోవాలని తెలిపారు. దరఖాస్తు దారులు రుసుము చెల్లించిన 48 గంటల్లోగానే ప్రొసీడింగ్స్ జారీ చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సంధ్య,టిపిఓ వీరస్వామి, తదితరులు పాల్గొన్నారు.