
Corporator Inspects Bathukamma Arrangements
బతుకమ్మ పండుగ ఏర్పాట్లను పరిశీలించిన స్థానిక కార్పొరేటర్.
కాశిబుగ్గ నేటిధాత్రి
గ్రేటర్ వరంగల్ 16వ డివిజన్ లోని ధర్మారం మరియు కట్టమల్లన్న వద్ద సద్దుల బతుకమ్మ సందర్భంగా చేపట్టుతున్న ఏర్పాట్లను స్థానిక 16వ డివిజన్ కార్పొరేటర్ సుంకరి మనీషా శివకుమార్ పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ బతుకమ్మ పండుగకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని, మహిళలందరూ సంతోషంగా బతుకమ్మ ఆడుకునేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని
ఆర్ అండ్ బి శాఖ,ఇరిగేషన్ శాఖ, ఆరోగ్యశాఖ,మున్సిపల్ శానిటేషన్,ఎలక్ట్రికల్, ఇంజనీరింగ్ విభాగాలకు సంబంధించిన అధికారులకు పలు సూచనలు చేశారు, అధికారులందరూ సమన్వయంతో పని చేయాలని అన్నారు..