
Bellampalli Suresh Madiga..
వికలాంగుల సింహ గర్జనను విజయవంతం చేయాలి
మండలంలో వికలాంగుల సమీక్ష సమావేశం
ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి దుమ్ము వెంకటేశ్వర్లు
మహాదేవపూర్ ఆగస్టు6 (నేటి ధాత్రి )
మహాదేవపూర్ మండల కేంద్రంలోని వికలాంగుల మరియు ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘం ఆధ్వర్యంలో వికలాంగుల సింహగర్జనలో విజయవంతం చేయడానికి ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ అధ్యక్షతన ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని వెంకటేశ్వర్లు అన్నారు ఆయన మాట్లాడుతూ మండలంలోని వికలాంగులు అత్యధిక సంఖ్యలో పాల్గొనాలని వికలాంగులకు ఆరు వేలు రూపాయలు వితంతువులు వృద్ధులు ఒంటరి మహిళలు చేనేత బిడి గౌడ్ అన్నలకు 4000 రూపాయలు పించని ఇవ్వాలని డిమాండ్ చేశారు మందకృష్ణ వికలాంగుల సింహ గర్జన ఆగస్టు 13వ. తేదీన లక్షలాది వికలాంగులతో భారీ బహిరంగ సభ పెడుతున్న సందర్భంగా మండల కేంద్రంలోని వికలాంగులు అత్యధిక సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు .ఈ కార్యక్రమంలో వికలాంగుల జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ మాట్లాడుతూ మండల రాష్ట్రవ్యాప్తంగా వికలాంగుల సమస్యలు పరిష్కారానికి హైదరాబాదును చుట్టు ముట్టాలనిమన హక్కులను సాధించుకునే వరకు ఎమ్మార్పీఎస్ మనకు అండగా ఉంటుందని ఈ తరుణంలో వికలాంగులు అత్యధిక సంఖ్యలో పాల్గొని ఆగస్టు13న వికలాంగుల సింహ గర్జన విజయవంతం చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ఇన్చార్జ్ లు దుమ్ము వెంకటేశ్వర్లు రుద్రారపు రామచంద్రం జిల్లా వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు మాచర్ల వంశీకృష్ణ గౌడ్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు బెల్లంపల్లి సురేష్ వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య ప్రధాన కార్యదర్శి కన్నబోయిన కొమురక్క వికలాంగుల టౌన్ ప్రెసిడెంట్ మీర్జా ముస్తాక్ అధ్యక్షులు అంజలి మరియు ఎమ్మార్పీఎస్ యూత్ అధ్యక్షులు మంథని రవితేజ. టౌన్ ప్రెసిడెంట్ చింతకుంట సదానందం. ప్రధాన కార్యదర్శి లింగాల సుశాంత్ తదితరులు పాల్గొన్నారు