*23న ఆత్మగౌర పరిరక్షణ కై మాలల సింహ గర్జన..
*రిజర్వేషన్లు రద్దు కోసం ప్రభుత్వాల కుట్ర..
*ఎస్సీ వర్గీకరణతో మాలల వంచనకు ప్రయత్నం…
*సింహగర్జనతో మాలల సత్తా చాటుదాం…
*వ్యతిరేక ప్రభుత్వాలకు గుణపాఠం చెబుదాం…
*రాయలసీమ మాలల జేఏసీ నేతల పిలుపు…
తిరుపతి(నేటి ధాత్రి) మార్చి 19:
అనగారిన బలహీన వర్గాల అభ్యున్నతికి తోడ్పడే రిజర్వేషన్లను పూర్తిస్థాయిలో రద్దు చేయాలని కుట్రతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ వర్గీకరణ తెరపైకి తెచ్చి మాలలను దగా చేసేందుకు ప్రయత్నిస్తోందని రాయలసీమ మాలల జేఏసీ నేతలు ధ్వజమెత్తారు. బుధవారం బాలాజీ కాలనీలోని అంబేద్కర్ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రాయలసీమ మాలల జేఏసీ గౌరవ అధ్యక్షుడు అశోకరత్న మాట్లాడారు.2011 జనాభాను ప్రాతిపదికగా తీసుకొని మాలలను తక్కువగా చూపిస్తూ మాదిగలకు ఉపకరించేలా వర్గీకరణను ఆమోదానికి కూటమి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్నారు. వన్ మ్యాన్ కమిషన్ నివేదికను అడ్డుపెట్టుకుని అసెంబ్లీలో వర్గీకరణ ఆమోదం చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. యావత్తు దళిత జాతి ఓట్లతో గద్దెనెక్కి ఆ జాతి అణిచివేతకు పాలకులు ప్రయత్నించడం అత్యంత హేమమైన చర్య అన్నారు. రాజ్యాంగబద్ధంగా ఎంపికైన ఎంపీలు ఎమ్మెల్యేలు ఎస్సీ వర్గీకరణ పై ప్రశ్నించకుండా అచేతనంగా నిలబడడం దుర్మార్గమన్నారు. రాజకీయ లబ్ధి కోసం పాలకులు చేసే కుయుక్తులను అడ్డుకోకపోతే యావత్ దళిత జాతి రాజ్యాంగబద్ధంగా సిద్ధించిన రిజర్వేషన్లు పూర్తిస్థాయిలో కోల్పోయే పరిస్థితి దాపురుస్తుందన్నారు. ఇప్పటికీ వర్గీకరణ వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా మాలలు పెద్ద ఎత్తున వ్యతిరేకిస్తున్నారని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దళిత జాతి వ్యతిరేక పవిత్రమైన కూటమికి గుణపాఠం చెప్పేందుకు యావత్ మాల జాతి సన్నిద్ధం కావాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఇందులో భాగంగానే రాయలసీమ మాలల జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తారీఖున భారీ స్థాయిలో తిరుగుతూనే నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్లో 23వ తేదీ సాయంత్రం మూడు గంటలకు మాలల సింహగర్జన సభను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సింహగర్జన సభకు రాయలసీమలోని యావత్ మాల జాతి తో పాటు దళిత మేధావులు ఉద్యోగులు, పెద్ద ఎత్తున తరలివచ్చి మాలల ఐక్యతతో తమ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాయలసీమ మాలల జేఏసీ ప్రతినిధులు మల్లారపు మధు. సుదర్శనం. ఏ ఆర్ అజయ్ కుమార్. ధన శేఖర్. కే మురళి. అనిల్ కుమార్ పాల్గొన్నారు.