మా ఊరి కథలలో అచ్చ సుదర్శన్ జీవిత కథ
నడికూడ,నేటిధాత్రి:
మండలంలోని చర్లపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్న అచ్చ సుదర్శన్ జీవిత చరిత్ర భవాని సాహితీ వేదిక కరీంనగర్ వారి ఆధ్వర్యంలో గుండ మీది కృష్ణమోహన్ అనే కవి మా ఊరి కథలు(స్ఫూర్తి మంతుల చరిత్రలు) అను పుస్తకాన్ని రాయడం జరిగింది.ఈ పుస్తకాన్ని ఈరోజు ఓపెనింగ్ చేయడం జరిగింది.అట్టి పుస్తకంలో అచ్చ సుదర్శన్ జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని కవి రాయడం జరిగింది.తాను బీదరికం నుంచి నుంచి ఎదిగి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయుడుగా చేరుకున్న కథను ఇతర ఉపాధ్యాయులకు,యువకులకు స్ఫూర్తిగా ఉందని,చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడని కవి గుండ మీది కృష్ణమోహన్ అన్నారు.అందుకే స్ఫూర్తి మంతుల చరిత్ర లో అచ్చ సుదర్శన్ కు స్థానం దక్కిందని అన్నారు.