ప్రతి గ్రామంలో భోగ్ భండారో నిర్వహించాలి.
బంజారా ఆరాధ్య దైవం సేవాలాల్ జయంతికి సెలవు ప్రకటించాలి.
లైవ్ భద్రాద్రి జోనల్ ఇన్చార్జి బాలునాయక్.
కారేపల్లి నేటి ధాత్రి
కారేపల్లి మండల కేంద్రంలో లంబాడీల ఐక్యవేదిక (లైవ్) ఆధ్వర్యంలో సేవాలాల్ జయంతి ఏర్పాట్లపై సమావేశాన్ని ఏర్పాటు చేశారు. బంజారాల ఆరాధ్యదైవం సద్గురు సేవాలాల్ జయంతి ఫిబ్రవరి 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలకు సెలవు దినంగా ప్రకటించాలని. తహసిల్దార్ సంపత్ కుమార్ ఎంపీడీవో సురేందర్ కు లంబాడి ఐక్యవేదిక (లైవ్) భద్రాద్రి జోనల్ (భద్రాద్రి కొత్తగూడెం మహబూబాబాద్ ఖమ్మం) జిల్లాల ఇన్చార్జి బాలునాయక్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాలు నాయక్ మాట్లాడుతూ దేశ జనాభాలో 14 కోట్ల మంది ఉన్న బంజారాలు తెలంగాణలో కన్నుల పండుగగా ఈ వేడుక నిర్వహిస్తామన్నారు. బంజారాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సెలవును అధికారికంగా ప్రకటించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సిక్కుల ఆరాధ్యదైవమైన గురునానక్ జయంతి మహమ్మద్ ప్రవక్త జయంతిని ఇచ్చే సెలవుల్లో దీనికి సైతం చేర్చాలన్నారు. రాష్ట్రంలో 12 శాతం (40 లక్షల) జనాభా ఉండటంతో ప్రతి గ్రామంలో భోగ్ బండారో వేడుకను ఐక్యంగా కలిసి అంగరంగ వైభవంగా నిర్వహించాలని కోరారు. విషయాన్ని ఉన్నతాధికారులకు వివరిస్తానని తాహసిల్దార్ ఎంపీడీవో హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బంజారా సంఘం నాయకులు బానోతు రాములు నాయక్ భూక్య సక్రియ నాయక్ ఆంగోత్ రవి (ఠాగుర్) భూక్య రంజిత్ నాయక్ వాంకుడోత్ రమేష్ నాయక్ బానోత్ శంకర్ నాయక్ భూక్య మోతిలాల్ నాయక్ లంబాడీల ఐక్యవేదిక (లైవ్) నాయకులు భుక్య రమేష్ హాట్కర్ రాంబాబు బానోత్ ప్రేమ్ నాయక్ అంగోత్ కుమార్ జగన్ చంటి మోహన్ ఇంద్రజిత్ తదితరులు పాల్గొన్నారు.