సిరిసిల్ల(నేటి ధాత్రి):
బహుభాషా కోవిదుడు మాజీ ప్రధాని స్వర్గీయ పీవీ నరసింహారావు సేవలు చిరస్మరణీయమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగుల సత్యనారాయణ గౌడ్ అన్నారు.
సిరిసిల్లలోని గాంధీ చౌక్ లో పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారతదేశ మాజీ ప్రధాని, భారతరత్న, పీ.వీ నరసింహారావు 103 వ జయంతిని పురస్కరించుకుని పుష్పాంజలులను ఘటించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మొట్టమొదటిగా ప్రధానిగా పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ఎన్నో మంత్రిత్వ శాఖల పదవులకు. వన్నెతెచ్చిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. రాజీవ్ గాంధీ అకాల మరణానంతరం తర్వాత కష్టకాలంలో భారత దేశ ప్రధానిగా ఐదు సంవత్సరాలు చేపట్టి భారతదేశానికి పునర్ వైభవాన్ని తెచ్చారని ఆర్థిక సంస్కరణలతోపాటు భూసంస్కరణలు తీసుకువచ్చి బడుగు బలహీన వర్గాల శ్రేయస్సుకు, భారత దేశ అభివృద్ధికి ఎంతో కృషి చేశారని అన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగీతం శ్రీనివాస్, ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ సెల్ అధ్యక్షులు సూర దేవరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి చందన, కాంగ్రెస్ కౌన్సిలర్ లు,రోజా, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
స్వర్గీయ పీవీ నరసింహారావు సేవలు చిరస్మరణీయం
