Demand to Cancel Kapas Kisan App
కపాస్ కిసాన్ యాప్ వెంటనే రద్దు చేయాలి.
#బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి .
నల్లబెల్లి, నేటి ధాత్రి:
కపాస్ కిసాన్ యాపను రద్దుచేసి ఎలాంటి నిబంధనలు లేకుండా సీసీఐ పత్తిని కొనుగోలు చేయాలని ప్రకృతి వైపరీత్యాల వలన తీవ్రంగా నష్టపోయిన రైతాంగానికి తేమ పేరుతో ఆంక్షలు విధించకూడదని బీసీ హక్కుల సాధన సమితి జిల్లా కార్యదర్శి చింతకింది కుమారస్వామి అన్నారు. మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆవరణలో రైతు సంఘ నాయకులు మామిళ్ల మోహన్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరై కుమారస్వామి మాట్లాడుతూ 1970లో ఏర్పాటు చేసిన సీసీఐ రైతు పండించిన పత్తిని కొనుగోలు చేస్తూ వస్తున్నది . మోడీ ప్రభుత్వం రైతు వ్యతిరేక నల్ల చట్టాలు వచ్చే ప్రయత్నం చేయడంతో రైతాంగం చేసిన తీవ్రమైన ప్రతిఘటనతో కేంద్ర ప్రభుత్వం వెనకడుగు వేసి నల్ల చట్టాలను రద్దు చేసినట్టు ప్రకటించినప్పటికీ రైతాంగం మీద కుట్రలు చేస్తూనే ఉన్నది అన్నారు. ఓపెన్ మార్కెట్లో పత్తి నీ అమ్ముకోకుండా కపాస్ కిసాన్ యాప్ డౌన్లోడ్ చేసుకుని రైతాంగం స్లాట్ బుక్ చేసుకొని ఆ స్లాట్ లో చూపించిన తేదీ సమయం ప్రకారం ఎకరానికి ఏడు క్వింటాళ్ల వరకు మాత్రమే అమ్ముకునే నిబంధనలు విధించడం ఎనిమిది శాతం కన్నా తేమ ఎక్కువగా ఉంటే ధరలో తేడాలు ఉంటాయని పేర్కొనడం రైతులకు అన్యాయం చేయడమే అన్నారు. కౌలు రైతులు పేద సన్నా చిన్నకారు రైతులు ఈ అకాల వర్షాలకు పంటలతో తీవ్రంగా నష్టపోయి పెట్టుబడి రానీ పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారన్నారు మండలంలో ఇప్పటివరకు అధిక వర్షాలకు పంట నష్టపోయిన రైతాంగం యొక్క పంట వివరాలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎటువంటి ఆదేశాలు రాలేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారని రైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. పంట నష్టపోయిన పత్తి రైతులకు కనీసం ఎకరానికి 15 వేల రూపాయల చొప్పున నష్టపరిహారం రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని డిమాండ్ చేశారు .రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కేంద్ర ప్రభుత్వంతో చర్చించి రైతాంగానికి అండగా నిలవాలన్నారు లేనిచో రైతు సంఘ నాయకుల ఆధ్వర్యంలో ఉద్యమాలు ఉదృతం చేయడం తప్పదని అన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీటీసీ జన్ను జయరాజు సిపిఎం పార్టీ మండల నాయకులు బొడిగె సమ్మయ్య , గోనె సంజీవయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు
