టి. ఏ .జి .ఎస్. జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్.
మహా ముత్తారం నేటి ధాత్రి.
అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లనువెంటనే నెరవేర్చాలని తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పోలం రాజేందర్ డిమాండ్ చేశారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు వారి యొక్క డిమాండ్స్ నెరవేర్చాలని నిరవధిక సమ్మె చేస్తున్నారు, అందులో భాగంగా సీఐటీయూ ఆధ్వర్యంలో మహాముత్తార మండల కేంద్రంలోని ఎమ్మార్వో ఆఫీస్ ముందు అంగన్వాడీలు 5 రోజులుగా చేస్తున్న సమ్మెకు తెలంగాణ ఆదివాసి గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి పొలం రాజేందర్ పూర్తి మద్దతు తెలియజేసి మాట్లాడుతూ. అనేక దఫాలుగా అంగన్వాడీలు వినతుల రూపంలో ప్రభుత్వానికి తెలియజేశారని అయినా వారి యొక్క సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, అందుకే ఇప్పుడు అంగన్వాడీలు సమ్మె నోటీసు ఇచ్చి నిరువాదిక సమ్మెకు దిగారని వారన్నారు,గ్రామీణాభివృద్ధికి ముఖ్య భూమిక పోషిస్తున్న వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించకుండా, వారికి కనీస వేతనం ఇవ్వకుండా, వారికి రిటర్మెంట్ సమయంలో కేవలం అంగన్వాడీ టీచర్లకు లక్ష రూపాయలు, ఆయాలకు 50వేల రూపాయలు ఇస్తామనడం, వారిని అవమానించడమే అని అది ప్రభుత్వం యొక్క సిగ్గుమాలిన చర్యని వారు విమర్శించారు. అంగన్వాడి సెంటర్లను సూపర్వైజర్లతో ఓపెన్ చేయించి జిపి కార్యదర్శులతో విధులు నిర్వర్తించడం అంగన్వాడీలను భయభ్రాంతులకు గురి చేయడమే అని ఇది ప్రభుత్వానికి తగదు అని వారు మండిపడ్డారు,ఎన్ని కుయుక్తులు పన్నిన అంగన్వాడీలు భయపడరు,సమ్మె విరమించబోరని ,వారి డిమాండ్స్ నెరవేర్చెంత వరకు పోరాడుతరని వారు అన్నారు, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అంగన్వాడీల యొక్క డిమాండ్స్ ని అయినా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలని కనీస వేతనం 26 26 వేల రూపాయలు ఇవ్వాలని రిటర్మెంట్ బెనిఫిట్స్ అంగన్వాడీ టీచర్లకు పది లక్షల రూపాయలు ఆయాలకు ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని అదేవిధంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం గ్రాడ్యుయేట్ ఇవ్వాలని 60 సంవత్సరాలు దాటిన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుంటున్న వారికి రిటర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అదేవిధంగా ప్రమాద బీమా సౌకర్యం 5 లక్షల రూపాయలు ఇవ్వాలని ఈ న్యాయమైన డిమాండ్స్ ను వెంటనే నెరవేర్చాలని లేనియెడల రానున్న ఎలక్షన్ లో ప్రభుత్వానికి గుణపాఠం తప్పదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తోట దేవరాజు అంగన్వాడీ టీచర్లు ఆయాలు ఉన్నారు.