
The implementation of the PDPS system for purchasing cotton in the place of the Cotton Corporation of India (CCI) should be discontinued.
కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) స్థానం లో పత్తి కొనుగోలు కు పీడీపీఎస్ విధానం అమలు విరమించుకోవాలి.
తెలంగాణ రైతు సంఘం డిమాండ్.
కారేపల్లి: నేటి ధాత్రి
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పత్తి మద్దతు ధర కు తెలంగాణ రాష్ట్రం లో పత్తిని కొనుగోలు చేస్తున్న కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ని ఆ బాధ్యతల నుంచి తప్పించే ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం స్వస్తి పలకాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు డిమాండ్ చేశారు. గురువారం కారేపల్లి మండలం లో పాట్టిమీద గుంపు బాజ్జుమల్లాయిగూడెం లలో పత్తి పంట పరిశీలన చేశారు. రైతుల నుంచి కౌలు రేట్లు వివిధ రకాల పంటల సాగు పరిస్థితి మిర్చి సాగు విస్తీర్ణం పై రైతుల నుంచి వివరాలు స్వీకరించారు. ఈ సందర్భంగా తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు మాట్లాడుతూ
కేంద్ర ప్రభుత్వం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా మద్దతు ధర కు పత్తి కొనుగోలు చేయకుండా ప్రైస్ డెఫిషియన్సీ పేమెంట్ స్కీం ( పీడీపీఎస్) ను రాష్ట్రం లో ప్రవేశపెట్టాలని నిర్ణయించింది అని తెలంగాణ రాష్ట్రం లో అత్యధికంగా పత్తి పండించే ఆదిలాబాద్ జిల్లాలో ఈ వ్యవసాయ సీజన్ లో అమలుకు రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకరించింది అని పత్తి రైతులకు తీవ్రంగా నష్టం వాటిలే అవకాశం ఉందని రాంబాబు అన్నారు.
ఎంఎస్ పి విధానం లో భాగంగా కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల నుంచి పంటలు కొనుగోలు చేస్తుంది పీడీపీఎస్ విధానం వల్ల రైతు తన పత్తి పంటను బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత మార్కెట్ ధర కన్నా ఎం.ఎస్.పి ఎంత తక్కువ ఉంటే ఆ మొత్తాన్ని నేరుగా డిబిటి (డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్) పద్ధతుల్లో రైతు ఖాతాల్లో జమ చేస్తారు అంటే ప్రభుత్వం రైతు దగ్గర పంటను కొనదు కానీ మార్కెట్లో రైతు నష్టపోయిన మొత్తాన్ని సర్దుబాటు చేస్తుందని నూతన పథకాన్ని ప్రవేశపెట్టారు గత వానాకాలం సీజన్లో 44 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది పైగా రైతులు పత్తి పంట సాగు చశారు ఇంత మంది రైతులకు బహిరంగ మార్కెట్లో విక్రయించిన తర్వాత వ్యత్యాసం ధర నగదు బదిలీ చేయడం సాధ్యం కాదు మధ్యప్రదేశ్ లో 2016-17 లోనే 8 ప్రధాన పంటలకు పీడీపీఎస్ విధానాన్ని అమలు చేసి రైతులకు వ్యత్యాసాలు నిర్ధారించడంలో లోపాలు వ్యత్యాసపు ధర చెల్లింపులు ఆలస్యం మార్కెట్ ధరలు తేడాలు నిజమైన రైతులకు కాకుండా దళారులకు చెల్లింపులు వంటివి చోటు చేసుకోవటం తో మరుసటి సంవత్సరమై ఆ పథకాన్ని నిలిపివేశారని ఇప్పుడు తెలంగాణలో పీడీపీఎస్ ప్రయోగించడం పత్తి రైతులను నాశనం చేస్తుందని వెంటనే ఈప ఆలోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు మేరుగు సత్యనారాయణ తెలంగాణ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు దుగ్గి కృష్ణ సిఐటియు జిల్లా నాయకులు కుందనపల్లి నరేంద్ర రైతు సంఘం మండల కార్యదర్శి వజ్జా రామారావు బాదావత్ శ్రీనివాసరావు మన్నెం బ్రహ్మయ్య వడ్లమూడి మధు యనమద్ది రామకృష్ణ మహిళా రైతులు పాల్గొన్నారు.