
Telangana Armed Struggle – Communists’ Legacy
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులు కమ్యూనిస్టులే
బిజెపి.ఆర్ఎస్ఎస్. లకు పోరాటానికి ఎలాంటి సంబంధం లేదు
ఉద్యమ కాలంలో తెల్లదొరల సేవలో ఆర్ఎస్ఎస్. బిజెపి
సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎం చుక్కయ్య
నేటి ధాత్రి అయినవోలు :-
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపినకమ్యూనిస్టులు నిజాం ప్రభువు, రజాకార్లు భూస్వాములు, జాగీర్దార్ల ఆధీనంలో ఉన్న భూముల్ని స్వాధినం చేసుకుని 10 లక్షల ఎకరాలను పేద ప్రజలకు పంచిన చరిత్ర కమ్యూనిస్టులది. భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం రజాకార్లకు వ్యతిరేకంగా 1946 నుంచి 1951 వరకు ఎర్రజెండా నాయకత్వంలో సాగిన తెలంగాణ సాయుధ పోరాటంలో 4వేల మంది కమ్యూనిస్ట్ లు అమరులయ్యారు. వేలాది గ్రామాలు నిజాం నవాబు పాలన నుంచి విముక్తి పొందాయి. అలాంటి మహోత్తరమైన ప్రజాపోరాటంలో ముస్లింలు సైతం ముఖ్యపాత్ర పోషించారు. అని అన్నారు. పోరాటానికి ఎలాంటి సంబంధంలేని బీజేపీ ఆర్ఎస్ఎస్ హిందూ ముస్లీం పోరాటంగా చిత్రీకరిస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది’ అని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు. చుక్కయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఎం పార్టీ మాజీ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ .సీతారాం ఏచూరి ప్రధమ వర్ధంతి సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహం దగ్గర ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం. సిపిఎం మండల కమిటీ సభ్యులు రామ్ కుమార్ అధ్యక్షతన జరిగింది.తెలంగాణ సాయుధ పోరాటం వాస్తవాలు వక్రీకరణ పై స్టడీ.సర్కిల్ . ఏం చుక్కయ్యగారు బోధించారు. తెలంగాణ సాయుధ పోరాటం నిజాం పాలనలో తెలం గాణ ప్రాంతం మంత వెట్టి నడిచేదని, భూస్వాములు, పెత్తందార్లు, పటేల్. పట్వారీ లకు లొంగి పనిచేయాల్సిన దుస్థితి ఉండేదన్నారు.
దుర్భర పరిస్థితి నుంచి విముక్తి కల్గించి, ప్రజల్ని కాపాడేందుకు 1930లో ఆంధ్రమహాసభ పేరుతో కమ్యూనిస్టులు ప్రజల ముందుకొచ్చారని పేర్కొన్నారు. చాకలి ఐలమ్మ ఐదెకరాల పంటను భూస్వామ్య గుండాలు ఎత్తుకెళ్లేందుకు పూనుకుంటే భీంరెడ్డి నర్సింహారెడ్డి. మల్లు స్వరాజ్యం. కృష్ణమూర్తి. మల్లు వెంకట నరసింహారెడ్డి దళం ఆ పంటను రక్షించి భూస్వామ్య గుండాలను ఎదిరించిన విషయాలను ఆయన వివరించారు. దొడ్డి కొమరయ్య బలిదానం తర్వాత సాయుధ పోరాటం మరింత ఉధృతంగా కొనసాగిందని, అన్నారు సిపిఎం మండల కార్యదర్శి కాడబోయిన లింగయ్య మాట్లాడుతూ. బాంచన్ కాల్మొక్త అన్న ప్రజలు బంధూకులు పట్టి పోరాటంలోకి దూకారని తెలిపారు. సాయుధ పోరాట వారసత్వాన్ని కొనసాగిస్తున్న సిపిఎం ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై మరిన్ని ఉద్యమాలు నడిపేందుకు పార్టీ శ్రేణులు సిద్దం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు కే నారాయణరెడ్డి. మడిగే నాగరాజు. గుండెకారి బాబురావు వరికల్ గోపాల్ రావు .గుండెకారి. చిన్న మహేందర్. కే కవిత.రాజేశ్వర రావు. తదితరులు పాల్గొన్నారు