చిట్యాల మండల వివో ఏలపై సీసీల వేధింపులు ఆరికట్టాలి..!
సీసీలను తక్షణమే సస్పెండ్ చేయాలి
సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి జిల్లా కార్యదర్శి మారపల్లి మల్లేష్ డిమాండ్..
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలోని శ్రీ మహాలక్ష్మి మహిళ సంఘంలో వివో ఏలుగా విధులు నిర్వహిస్తున్న 36 వివో లను మానసిక వేధింపులకు గురి చేస్తున్న సూటి పోటి మాటలతో ఇబ్బందులకు గురి చేస్తున్న సీసీలను తక్షణమే సస్పెండ్ చేయాలని మారపల్లి మల్లేష్ డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వారిని కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేస్తూఈ సందర్భంగా మాట్లాడుతూ వాళ్ళ సమస్యలకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ సమస్య పరిష్కారం చేయడంలో జిల్లా ఉన్నతాధికారి అయినటువంటి పీడి నిర్లక్ష్యం చేస్తూ చూస్తున్న వైఖరిని సరైనది కాదని అన్నారు జిల్లా కలెక్టర్ దృష్టికి ఎమ్మెల్యే దృష్టికి తీసుకుపోయిన వారి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అనే చందంగా ఉంది సమస్య పరిష్కారం వైపు ఆలోచించిన దాఖలాలు కానరావడం లేదు వివో ఏ లకు వారి పరిధిలో ఉన్నటువంటి మహిళా సంఘాలకు లింకేజీ లోనులు ఇవ్వకుండా శ్రీనిధి గ్రేడింగులు చేయకుండా హెచ్ ఎల్ పి లు రోల్ బ్యాగు చేసి మీరు పని చేయడం లేదని సంఘాలకు తప్పుడు సమాచారం ఇస్తూ గత నెలలో చేసినటువంటి పనులను గత సంవత్సరం కాలంలో మీ రికార్డులు మొత్తం తీసుకురావాలని లేకపోతే మిమ్మల్ని తొలగిస్తానని హుకుం జారీ చేస్తున్నారు వారి యొక్క లాగిన్ లో ఎంట్రీ చేయకుండా జీతాలు రాకుండా వారి కడుపు మీద కొడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారు తక్షణమే సీసీలపైచర్య తీసుకోని వెంటనే వారిని సస్పెండ్ చేసి వివో ఏ లకు న్యాయం చేయాలని అలాగే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న డిఆర్డిఓ పిడి లపై తక్షణమే ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ భూపాలపల్లి మండల కార్యదర్శి బుర్రి కుమారస్వామి వివో ఎల,మండల అధ్యక్షురాలు కొమురవెల్లి రజిత కార్యదర్శి కోడూరి ఓంకార్ కోశాధికారి రామ్ కోమలత సహాయ కార్యదర్శి కొత్తూరి సాలన్న గౌరవ అధ్యక్షురాలు రుక్మాబాయి జ్యోతి మమత సుగుణ శ్వేత రాజేశ్వరి కృష్ణవేణి రజిత సంధ్య స్రవంతి సల్పాల రమేష్ రామస్వామి శ్యాము తదితరులు పాల్గొన్నారు..
