త్వరలో యువజన క్రీడ ఉత్సవాలు
ఆసక్తి గల క్రీడాకారులు దరఖాస్తు చేసుకోగలరు
జిల్లా యువజన క్రీడల అధికారి, సి హెచ్ రఘు
భూపాలపల్లి నేటిధాత్రి
జయశంకర్ భూపాలపల్లి
జిల్లా స్థాయి యువజనోత్సవాలు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా యువజన క్రీడల శాఖ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఆధ్వర్యములో 29వ జాతీయ యువజన దినోత్సవం కోసం జిల్లా స్థాయి యువజన ఉత్సవాలు “సాంస్కృతిక” “ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్” ఈ క్రింద తెలుపబడిన అంశాలలో పోటీలు నిర్వహించబడును.
జానపద నృత్యం (సమూహం) జానపద పాటలు (సమూహం)
సైన్స్ మేళా (ఏదైనా ఇన్నొవేషన్ లైఫ్ స్కిల్స్ కాంపోనెంట్ కథా రచన కవిత్వం ప్రకటన పెయింటింగ్
సైన్స్ మేళా
జిల్లా స్థాయిలో సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇన్నోవేషన్‌ను ప్రతిబింబించేలా తమ ప్రాజెక్టులను ప్రదర్శించడం ద్వారా యువత మేళాలో పాల్గొనాలి. ఈ విభాగంలో పోటీ వ్యక్తిగతంగా సమూహానికి విడివిడిగా ఉంటుంది. పోటీలు ప్రాక్టికల్ అప్లికేషన్స్, పొదుపు ఆవిష్కరణలు, ప్రెజెంటేషన్ ఇంపాక్ట్ ఆధారంగా ఉంటాయి. సాధ్యమైనంత వరకు ఇప్పటికే ఉన్న వ్యవస్థల యొక్క నిష్క్రియ నమూనాలు/క్రాఫ్ట్ వర్క్‌లను నిరుపించాలి.
ఈ నేపధ్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొదటి స్థానంలో గెలుపొందిన యువ కళాకారులను (యువతి యువకులు) రాష్ర్టస్థాయి పోటీలకు ఎంపిక చేసి పంపబడును.
పోటీలు నిర్వహించు తేది ప్రారంభ సమయము త్వరలోనే తెలిచేయబడును.
పోటీలో పాల్గానే యువ కళాకారులు జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చెందిన వారై ఉండాలి.
అర్హతులు ఇతర అంశాలు:
జిల్లా స్థాయి పోటీలలో పాల్గొనే యువతీ యువకులు వయస్సు పోటీ నిర్వహించు నాటికి 15 నుండి 29 సంవత్సరాలలోపు ఉండవలెను.
పోటీలో పాల్గొనే అంశానికి సంబందించిన సామగ్రిని సంబందిత కళాకారులు తమ వెంట తెచ్చుకోవలెను.
జానపద నృత్యము (బృందం) నందు (10) మంది సభ్యులు మించకూడదు. 15 నిమిషాల గరిష్ట కాలపరిమితి (సీడీలు, పెన్ డ్రైవ్ లను అనుమతించబడవు).
జానపద పాటల (బృందం) (10) మంది సభ్యులు మించకూడదు. రికార్డు చేయబడిన సీడీలు పెన్ డ్రైవ్ లు అనుమతించబడవు. వారు ప్రత్యక్షముగా ప్రదర్శించవలసి ఉంటుంది.
పోటీలలో తుదినిర్ణయము యువజన సర్వీసుల శాఖచే నియమించబడిన న్యాయనిర్ణేతలు నిర్ణయిస్తారు.
సంబంధిత అంశాలలో పాల్గొనే యువతీ యువకులు తమ ప్రవేశంను వారి బయో డేటాను యువజన సర్వీసుల కార్యాలయములో సంబంధిత సాంస్కృతిక కార్యక్రమము జరుగు స్థలము వద్ద దరఖాస్తు ఎంట్రీ కౌంటర్ల వద్ద తమ బయో డేటాను పూర్తి స్థాయిలో నింపి ఇవ్వగలరు. వయస్సు ధృవీకరణ కొరకు ఎస్ఎస్సి మేమో ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ తో పాటు (2) రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలను తిసుకోనిరాగలరు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఆసక్తి గల యువతీ యువకులు / కళాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవాలని జిల్లా యువజన క్రీడల అధికారి, సి హెచ్ రఘు ఒక ప్రకటనలో తెలిపినారు ఇతర సమాచార నిమత్తము కార్యాలయ పని దినములలో 9618011096, 8125113132 లను సంప్రదించి తగు సమాచారం పొందగలరు.
