
“Powerloom Workers Demand Handloom Office Back in Sirisilla”
చేనేత జౌళి శాఖ కార్యాలయాo కార్మికులకు చేరువలో ఉండాలి
సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కి , చేనేత జౌళి శాఖ ఏడి కి వినతి పత్రం అందజేత
సిరిసిల్ల టౌన్: ( నేటి ధాత్రి )
సిరిసిల్ల పట్టణ కేంద్రంలో సిఐటియు పవర్లూమ్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు కోడం రమణ మాట్లాడుతూ సిరిసిల్ల పవర్లూమ్ వస్త్ర పరిశ్రమలో వివిధ రంగాలపై ఆధారపడి పనిచేస్తున్న వేదలాదిమంది కార్మికులకు చాలా సంవత్సరాలుగా సిరిసిల్ల బి.వై. నగర్ లో అందుబాటులో ఉండి సేవలందించిన జిల్లా చేనేత జౌళి శాఖ కార్యాలయాన్ని కలెక్టరేట్ సముదాయంలోకి మార్చడం వలన కార్మికులు వివిధ సంక్షేమ పథకాలు , సమాచారం కోసం లేదా ఏదైనా పని నిమిత్తం కలెక్టరేట్ లోని చేనేత జౌళి శాఖ కార్యాలయానికి వెళ్లాలంటే కార్మికులకు దూర భారంతో పాటు ఆర్థిక భారం మరియు కొంత సమయం పని కూడా కోల్పోయి అనేక ఇబ్బందులకు గురవుతున్నారని రాను పోను ప్రయాణంలో
ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉందన్నారు.సిరిసిల్ల పట్టణం బి.వై. నగర్ లో చేనేత జౌళి శాఖ కార్యాలయానికి సొంత భవనం ఉన్నప్పటికీ అప్పటి కలెక్టర్ ఏకపక్ష నిర్ణయంతో ఆఫీసును కలెక్టరేట్ సముదాయంలోకి మార్చడం జరిగిందని ఆఫీసును మార్చడం ద్వారా కార్మికుల ఎదుర్కొంటున్న ఇబ్బందుల దృశ్య యధావిధిగా సిరిసిల్లలోకి ఆఫీసును మార్చాలని పలు దాఫాలుగా కలెక్టర్ గారికి విన్నవించినప్పటికీ కూడా కలెక్టర్ పట్టించుకోలేదని ప్రస్తుతం కొత్తగా వచ్చిన ఈ కలెక్టర్ అయినా వేలాదిమంది కార్మికులకు ఎదురవుతున్న ఇబ్బందులను గుర్తించి ఆఫీసును యధావిధిగా సిరిసిల్లలోకి మార్చే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిరిమల్ల సత్యం , ఉడుత రవి , గుండు రమేష్ , ఎక్కల్ దేవి జగదీష్ , బాస శ్రీధర్ , స్వర్గం శేఖర్ , పత్తిపాక శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.