
Seethalamma Bonala Jatara.
ఘనంగా మడేలేశ్వర స్వామి బోనాల జాతర….
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
రామకృష్ణాపూర్ పట్టణంలోని బిజొన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి ఆధ్వర్యంలో రజకుల కుల దైవం మడేలేశ్వర స్వామి,సీతాలమ్మ బోనాల జాతర ఘనంగా నిర్వహించారు.మహిళలు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి రజక సంఘం కార్యాలయం నుండి అమరవాది చెరువు సమీపంలోని మడేలేశ్వర స్వామి గుడి వద్దకు పెద్ద ఎత్తున వెళ్లి బోనాలు సమర్పించారు. అనంతరం బిజొన్ రజక సంఘం అధ్యక్షుడు నడిగోట తిరుపతి మాట్లాడారు.

ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో రజకుల కుల దైవం అయిన మడేలయ్య కు భక్తి శ్రద్ధలతో బోనాలు చేసి, నైవేద్యాలు సమర్పిస్తామని అన్నారు.దేవుడి ఆశీస్సులు ప్రతి ఒక్కరిపై ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు నడిగోట శంకర్, కోశాధికారి కంచర్ల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి పున్నం సమ్మయ్య,తిరుపతి, కనకయ్య,రాజేశ్వరి, మాజీ కౌన్సిలర్ పోగుల మల్లయ్య, జిల్లా కార్యదర్శి రాములు, సహాయ కార్యదర్శి పైతరి ఓదెలు, సంఘం సభ్యులు,మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.