తంగళ్ళపల్లి నేటి ధాత్రి
తంగళ్ళపల్లి మండలం గ్రామపంచాయతీలో పనిచేసిన సిబ్బంది తమకు రావలసిన పెద్దమైన సమస్యలు పరిష్కరించడంతో పాటు మా సమస్యలు పరిష్కరించాలని ఎంపీడీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణలో గ్రామపంచాయతీ సిబ్బంది అందరినీ పర్మినెంట్ చేయాలని జీవో నెంబర్ 51ని సవరించాలని మల్టీపర్పస్ వర్కర్స్ రద్దు చేయాలని కేటగిరీల వారీగా వేతనాలు అమలు చేయాలని 11వ పిఆర్సి ప్రకటించిన విధంగా జీవో నెంబర్ 60 ప్రకారం గ్రామపంచాయతీ కార్మికులకు వేతనాలు చెల్లించాలని కార్మికుల జీతాలు ప్రభుత్వమే ప్రత్యేక గ్రాంటు ఏర్పాటు చేసి వాటి ద్వారా జీతాలు విడుదల చేయాలని వేతనాలు చెల్లించడంలో జప్యం జరుగుతున్న దానిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇట్టి అంశాలపై ప్రభుత్వం తొందరగా స్పందించి గ్రామపంచాయతీ సంఘాలసిబ్బందితో చర్చలు జరిపి తమ సమస్యలు పరిష్కరించాలని లేనిచో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామపంచాయతీ సిబ్బంది రాష్ట్రవ్యాప్తంగా పోరాటాలతో పాటు నిరవధిక సమ్మె చేయడానికి వెనుకాడబోమని ఈనెల 20 25వ తేదీలోపు రాష్ట్రంలో జిల్లాల మండల వారీగా సమ్మె చేస్తామని ఎంపీడీవో కి ఇచ్చిన వినతిపత్రంలో స్థానిక సిబ్బంది పేర్కొన్నారు ఇందులో మండల అధ్యక్షులు శ్రీనివాస్ గౌరవ అధ్యక్షులు కే చంద్రం ఉపాధ్యక్షులు కే రాజు సిబ్బంది రాజు రమేష్ తదితరులు పాల్గొన్నారు