Use Government Grain Centres
ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
#మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
ప్రభుత్వం ఆమోదితం చేసిన ధాన్యపు కొనుగోలు కేంద్రాల వద్దనే రైతులు ధాన్యాన్ని విక్రయించుకోవాలని నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ మేరకు మాట్లాడుతూ దళారుల చేత మోసపోకుండా ప్రభుత్వం నుంచి ప్రకటించిన కొనుగోలు కేంద్రాల వద్దనే ధాన్యాన్ని విక్రయిస్తే మద్దతు ధరతో పాటు 500 బోనస్ అందించడం జరుగుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ జిల్లా ఇన్చార్జి విజయ్ భాస్కర్ రెడ్డి, నోడల్ అధికారి సోమేశ్వర్, సీఈవో ఎల్లన్న, సొసైటీ డైరెక్టర్ బత్తిని మహేష్ యాదవ్, బైరి మురళి, పోడేటి కిషోర్, జక్కుల శ్రీను, ఎద్దు సాంబయ్య, సామల సాంబయ్య, కనకం బాబు, పాండవుల శంకర్ లింగం, సిబ్బంది పెంటయ్య, రజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
