ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
వ్యవసాయ సొసైటీ చైర్మన్ మైపాల్ రెడ్డి.
వెంకటాపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం.
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మహమ్మదాపురం వ్యవసాయ సహకార సంఘం అధ్యక్షులు ఊరటి మైపాల్ రెడ్డి అన్నారు. మంగళవారం దుగ్గొండి మండలంలోని వెంకటాపురం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని చైర్మన్ రెడ్డి మహిపాల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏ గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాకు రూ.2320, సీ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2300 ప్రభుత్వ మద్దతు ధర కేటాయించిందని పేర్కొన్నారు. ఏ గ్రేడ్ ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన ధరతోపాటు రూ.500 బోనస్ అదనంగా రైతులకు అందిస్తుందని చైర్మన్ తెలిపారు. ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు నాంపల్లి సుధాకర్, జంగిలి రవి,జరుపుల శ్రీను, సీఈఓ ఎం రమేష్, ప్రకాష్ ,ఇన్చార్జి సాంబయ్య, రైతులు లింగారెడ్డి, ఉమామహేశ్వర్ రెడ్డి, తిరుపతి, మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.