
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సతీష్ గౌడ్.
భూపాలపల్లి నేటిధాత్రి
టేకుమట్ల మండలం వెలిశాల గ్రామంలో ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి గాజర్ల అశోక్ గౌడ్ మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ గౌడ్ పాల్గొన్నారు
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏసు క్రీస్తు అను గ్రహం అందరిపై ఉండాలి. మానవవాళికి
ప్రేమ,శాంతి మార్గం చూపిన మహనీయుడు ఏసుక్రీస్తు అని, అతడి అనుగ్రహం అందరిపైనా ఉంటుందని సతీష్ గౌడ్ అన్నారు. క్రైస్తవ మత పెద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం కేక్ కట్ చేసి క్రైస్తవ సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.క్రైస్తవ సోదరులు సతీష్ గౌడ్ ని,నాయకులను శాలువాతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో.కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి,యూత్ కాంగ్రెస్ మాజీ జిల్లా అధ్యక్షుడు బండ శ్రీకాంత్,కాంగ్రెస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు బండి రవీందర్,పొన్నం సాంబయ్య, కోశాధికారి శాస్త్రాల కిరణ్,నాయకులు వంగ నరేష్, స్వామి రావు. పంజాల రవి.పోల్సాని దేవేందర్రావు. శ్రీనివాసరావు.ఆరపల్లి తిరుపతి. పురుషోత్తం శంకర్.యూత్ నాయకులు అరకొండ క్రాంతి.ఎర్రవెల్లి మహేష్,చర్చి ఫాదర్ లు తదితరులు పాల్గొన్నారు.