Government's Inability to Provide Raithu Bandhu for Yasangi Crop
యాసంగి పంటకు రైతు బంధు ఇవ్వలేని అసమర్ధత ప్రభుత్వం
కోటపల్లి మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా
బాపు నాయక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
యాసంగి పంటకు రైతుబంధు ఇవ్వలేని అసమర్ధత కాంగ్రెస్ ప్రభుత్వం అని కోటపల్లి మండలం బీఆర్ఎస్ సోషల్ మీడియా బాబు నాయక్ మండిపడ్డారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అయినా కూడా రైతులను వేధిస్తున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇప్పటివరకు రైతు బంధు వేయకుండా కనీసం యూరియా బస్తాలు ఇవ్వకుండా రైతులను ఎన్ని రోజులని గోస పెడతారని అన్నారు.ప్రభుత్వానికి నిజంగా రైతులపై ప్రేమ ఉంటే జనవరి నెలలో రైతు బంధు డబ్బులు వేసి రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ యాసంగి పంటలో వరి నాట్లు వేస్తారు కాబట్టి యూరియా బస్తాలను రైతులకు అందుబాటులో ఉంచాలని బాపు నాయక్ డిమాండ్ చేసారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కెసిఆర్ ని టార్గెట్ చేసుకొని తిట్టడం తప్ప చేసింది ఏమీ లేదని అన్నారు.అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీల గురించి,420 హామీల గురించి అడుగుతే,పండ పెట్టి తొక్కుతా,పేగు మెడల వేసుకుని ఊరేగుతా,లాగులొ తొండలు విడుస్తా! అనే మాటలు మరిచిపోయి,ఇప్పటికైనా నూతన సంవత్సరంలో,ఆరు గ్యారెంటీలు 420 హామీ లు, అమలు చేసే దిశగా మీకార్యచరణ ఉండాలని, కోటపల్లి మండల బీఆర్ఎస్ సోషల్ మీడియా
బాపు నాయక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
