“BRS Slams Telangana Govt Over Delay in Rythu Bandhu for Yasangi”
జనవరి వచ్చిన కూడా యాసంగి పంటకు రైతుబంధు వేయలేని అసమర్ధత ప్రభుత్వం.
◆-: బీఆర్ఎస్ పార్టీ, బోరేగౌ గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్
జహీరాబాద్ నేటి ధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న కూడా రైతులను వేధిస్తున్న సీఎం. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని బీఆర్ఎస్ పార్టీ, ఝరాసంగం మండల బోరేగౌ గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్.అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్న కూడా ఇంతవరకు రైతుబంధు వేయకుండా కనీసం యూరియా బస్తాలు ఇవ్వకుండా, రైతులను ఎన్ని రోజులని గోసపెడతారు. మీకు నిజంగా రైతులపై ప్రేమ ఉంటే జనవరి చివరి వరకు రైతుబంధు వేయండి. రైతులు ఈ యాసంగి పంటలో, వేసుకుంటారు కాబట్టి యూరియా బస్తాలు సప్లై చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సిఆర్ గారిని టార్గెట్ చేసుకొని తిట్టడం తప్ప మీరు చేసింది ఏమీ లేదు. అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఆరు గ్యారెంటీల గురించి మరియు 420 హామీల గురించి అడుగుతే, పండ పెట్టి తొక్కుతా, పేగులు మెడల వేసుకుని ఊరేగుతా! లాగులొ తొండలు విడుస్తా!! అనే మాటలు మరిచిపోయి, ఇప్పటికైనా నూతన సంవత్సరంలో, ఆరు గ్యారెంటీలు 420 హామీలు, అమలు చేసే దిశగా, మీకార్యచరణ ఉండాలని బీఆర్ఎస్ పార్టీ, బోరేగౌ గ్రామ నూతన సర్పంచ్ నాగేందర్ పటేల్ తెలిపారు.
