Govt Aims to Empower Farmers
రైతును రాజులను చేయడమే ప్రభుత్వ లక్ష్యం.
వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ తిరుపతమ్మ సుధీర్.
నడిగూడెం, నేటి ధాత్రి :
రైతు పండించిన ప్రతి గింజ ప్రభుత్యం కొనుగోలు చేస్తుందని రైతులు ఎవరు ఆందోళన పడొద్దని రైతును రాజును చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ వేపూరి తిరపతమ్మ సుదీర్ అన్నారు. సోమవారం మండల కేంద్రంలో గల నడిగూడెం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పరపతి ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కాగిత రామచంద్రపురం పిఎసిఎస్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ధాన్యం విక్రయించినట్లయితే ధాన్యం ఏరకం 2389 రూపాయలు, కామన్ గ్రేడ్ రకం 2369 రూపాయలుగా నిర్ధారించినట్లు తెలిపారు. వీటితోపాటు బోనస్ 500 రూపాయలు లభిస్తాయి అని తెలిపారు. ధాన్యం విక్రయించిన 48 గంటలలో రైతుల ఎకౌంట్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలిపారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దు అని సూచించారు.ధాన్యం విక్రయించే రైతులు తప్పక పట్టాదార్ పాస్ పుస్తకం, బ్యాంక్ అకౌంట్, ఆధార్ కార్డ్ తప్పక తీసుకురావాలని సూచించారు. ధాన్యంలో తేమ,తాలు,మట్టి పెల్లెలు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ దున్న శ్రీనివాస్, కాగిత రామచంద్రపురం సర్పంచ్ చక్రాల ఉమా పిచ్చయ్య, కేశవాపురం సర్పంచ్ గోసుల రాజేష్, తహశీల్దార్ సోమపొంగు సూరయ్య, ఎంపీడీవో మాల్సూరు నాయక్, ఎస్సై అజయ్ కుమార్, ఏవో గోలి మల్సూర్, ఏపిఎం దుర్గాప్రసాద్, ఆర్ ఐ గోపాలకృష్ణ, ఏ ఈ ఓ లు నిమ్మ పిచ్చయ్య, రేణుక, పి ఏ సి ఎస్ పర్సనల్ ఇంచార్జ్ చంద్రకళ, సీఈఓ కిరణ్ కుమార్ రెడ్డి, పిఎసిఎస్ సెంటర్ ఇన్చార్జ్ బీరవెల్లి సుధాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ గుండు శీను, ఉప సర్పంచ్ ఎలుగూరి నాగరాజు దోసపాటి రవి కాంగ్రెస్ పార్టీ నాయకులు వేపూరి సుధీర్, లింగారెడ్డి, ఉపేందర్, కాసాని గోపీనాథ్ కాసాని శివ కృష్ణ, గుండు పాపయ్య, తదితరులు పాల్గొన్నారు.
