
Congress Focus on Welfare and Development
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుంది…
జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధికార ప్రతినిధి వొడ్నాల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు పల్లె రాజు లు అన్నారు.బుదవారం రామకృష్ణాపూర్ పట్టణంలోని రాజీవ్ చౌక్ చౌరస్తాలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి, జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ అమరవీరులను స్మరించుకుంటూ ,విమోచన దినోత్సవాన్ని సైతం స్మరించుకున్నారు. అనంతరం వారు మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలలో భాగంగా
6 గ్యారెంటీలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే, కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చొరవతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని అన్నారు.మంత్రి మంగళవారం మున్సిపాలిటీ రివ్యూ మీటింగ్ నిర్వహించారని, అమృత్ స్కీం కింద ఆర్కేపి,గద్దెరాగడి ఏరియాలలో 2 వాటర్ ట్యాంక్ లు ఏర్పాటు చేసి మంచినీటిని అందిస్తామని అన్నారు. రెండు ఏరియాలకు శ్మశాన వాటికలు సైతం ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అఫ్జల్ లాడెన్,బొద్దుల ప్రేమ్ సాగర్,మేకల శ్రీను, గోపు రాజం,ఎల్పుల సత్యం,భైర మల్లేష్,ఎల్పుల మల్లేష్,బత్తుల శ్రీనివాస్,రామస్వామి, రామ కృష్ణ, బోనగిరి రవీందర్,పందిరి లింగయ్య,సరేష్,లచ్చులు,హరిప్రసాద్, శారద తదితరులు పాల్గొన్నారు.