నడికూడ,నేటి ధాత్రి:
మండలంలోని చర్లపల్లి గ్రామంలో పలువురు కాంగ్రెస్ పార్టీ కి చెందిన నాయకులు పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో బి.ఆర్.యస్.లో చేరడం జరిగింది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బి.ఆర్.యస్.పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు చూసి పార్టీ లో చేరారని,రానున్న రోజుల్లో అధికారంలోకి రాగానే మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని పేదోడికి అండగా ఉంటామని తెలిపారు.
పార్టీ లో చేరిన వారు గోగుల రవీందర్ రెడ్డి ( కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ ), నంది కొండ మహేందర్ రెడ్డి ( సీనియర్ నాయకులు ) , బొల్లారం రంజిత్ , ప్రశాంత్ , శనిగరం ప్రభు , శనిగరం మధుకర్ , శ్రీపతి , గంగారాం మహేష్ , సిద్దంకి అనిల్ , పొడిశెట్టి బ్రహ్మం ( టీడీపీ గ్రామ అధ్యక్షుడు ), తాళ్లపల్లి సాగర్ , దయ్యాల బాలాజీ , రావుల రాజేష్ , రావుల రాములు
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల నాయకులు ,కార్యకర్తలు తదితరులు ఉన్నారు.