బడ్జెట్ లో హామీలకు నిధులవ్వని ప్రభుత్వం,
జహీరాబాద్. నేటి ధాత్రి:
జహీరాబాద్, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క నిన్న 3లక్షల 4000కోట్ల బడ్జెట్ ను 2025-26 కు ప్రవేశ పెట్టడం జరిగింది ఇది కేవలం అంకెల గారడీలాగే ఉన్నది.గత.సంవత్సరం 2024- 25 లో 2లక్షల91000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెట్టినారు కాని ఖర్చు చేసింది మాత్రం 2లక్షల 20 వేల కోట్లే అంటే 71వేల కోట్లు ఖర్చు పెట్టకుండా వదిలేశారు ఈ బడ్జెట్ లో ఎంత ఖర్చు పెడతారో?
ప్రభుత్వానికి వచ్చే ఆదాయం చాలా తగ్గిపోయింది ఉ: రియల్ ఎస్టేట్ రంగం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా పడిపోయింది, రిజిస్ట్రేషన్ ల వల్ల వచ్చే ఆదాయం ప్రాధానమైనదిగా ఉండేది గత బడ్జెట్ లో 13000 కోట్లు వస్తాయని అంచనా వేసిన కాని కేవలం 5000 కోట్లు మాత్రమే వచ్చింది.ఎన్నికల ముందు ఈ ప్రభుత్వం ఎన్నో హామిలిచ్చి వాటికి బడ్జెట్ లో కేటాయింపులు చేయలేదు ప్రధానంగా 6 గ్యారంటీలకు కేటాయింపులు లేవు.ఎస్సిలను మర్చిపోయారు దళిత బందును ఆటకెక్కించారు దాని స్థానంలో అంబేద్కర్ అభయ హస్తం అని పెట్టి ఎస్సి,ఎస్టి లకు 12 లక్షల ఆర్థిక సహాయం చేస్తామన్నారు ప్రతి బడ్జెట్ లో నిధులు కేటాయిస్తామన్నారు మర్చిపోయారు.కామారెడ్డి బీసీ డిక్లరేషన్ లో బీసీ సంక్షేమానికి ఏడాదికి 20,000 కోట్ల చొప్పున కేటాయింపులు చేస్తామన్నారు అది మర్చిపోయారు,నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు దాని ఊసేలేదు,మహాలక్ష్మీ పథకం ద్వారా ప్రతి మహిళకు రూ 2500 ఇస్తామన్నారు దానికి కేటాయింపులు లేవు,విద్యా ఆరోగ్యం నకు పెద్ద కేటాయింపులు లేవు అన్ని అన్నారు తెలంగాణ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ మాజీ వై నరోత్తం అన్నారు.