
#తాజా మాజీ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు రాజారామ్ యాదవ్.
నల్లబెల్లి, నేటి ధాత్రి: అకాల వర్షంతో పంట నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని తాజా మాజీ సర్పంచ్ ఫోరం మండల అధ్యక్షుడు నానబోయిన రాజారామ్ యాదవ్ పేర్కొన్నారు ఈ మేరకు మంగళవారం సాయంత్రం గాలి వానతో భారీ వర్షం కురువగా వరి పంట చేతికి అందే సమయంలో వర్షం కారణంగా పంట పొలాల్లో వరి నేలకు ఒరగడంతో తీవ్ర నష్టం వాటిల్లిందని కోతలు కోసి కొనుగోలు కేంద్రానికి తరలించిన ధాన్యం రాశులు సైతం తడిసిపోవడంతో రైతులు ఆవేదన చెందుతున్నారని తక్షణమే ప్రభుత్వం స్పందించి అకాల వర్షం వల్ల దెబ్బతిన్న పంటలను సంబంధిత అధికారులచే పంట నష్టాన్నిఅంచన వేసి నష్టపరిహారం అందివ్వాలని అదేవిధంగా తడిసిన ధాన్యాన్ని మద్దతు ధర చెల్లించి ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.