రైతుల తడిసిన వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఆదుకోవాలి
సిరిసిల్ల టౌన్ 🙁 నేటి ధాత్రి)
ఈరోజు సిరిసిల్ల పట్టణ కేంద్రం లోని సి.పి.ఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో సి.పి.ఎం జిల్లా కార్యదర్శి ముషాం రమేష్ మాట్లాడుతూ గత మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్నటువంటి రైతుల ధాన్యం తీవ్రంగా తడిసి మొలకెత్తడం జరిగినది. అని తడిసిన ధాన్యాన్ని చూసి రైతులు కన్నీరుపెడుతున్నారు. అన్నారు.తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా కొనుగోలు కేంద్రాల్లో ఉన్నటువంటి ధాన్యానికి మొత్తం కొనుగోలు చేయాలని సి.పి.ఎం పార్టీ డిమాండ్ చేస్తుంది
ప్రతి సీజన్లో పంట పండించిన రైతుకు మొత్తం పంట ప్రభుత్వం కొనుగోలు చేసేదాకా పంటకు ఎప్పుడు ఏమైతదో అని భయం గుప్పిట్లో బతకవలసిన పరిస్థితి ఈ ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి.
గతంలో బి.ఆర్.ఎస్ పార్టీ అధికారంలో ఉన్న ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న బిజెపి కేంద్రంలో అధికారంలో ఉన్న రైతుల రైతుల బతుకులు ఎలాంటి మార్పు జరగడం లేదు.
బి.ఆర్.ఎస్ కాంగ్రెస్ బిజెపి పార్టీల. జెండాలు వేరైనా మోసాలు ఒకటే. విధానాలు ఒకటే రైతే రాజు అని
రైతులను మోసం చేసి రైతుల ఓట్లతో అధికారం లోకి వస్తున్నాయి. రైతులు పండించిన పంటకు నష్టం జరగకుండా ముందస్తుగా ప్రణాళిక చేయకపోవడంతోనే ప్రతి పంట సీజన్ లో వర్షాలతోటి రైతులు తీవ్రంగా నష్టపోవడం జరుగుతుంది.ఇప్పటికైనా రైతులకు నష్టాలు జరగకుండా పండిన పంటను వెంట వెంటనే కొనుగోలు చేసే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని అన్నారు ఈ సమావేశంలో సి.పి.ఎం కార్యదర్శి వర్గ సభ్యులు ఎగమంటి ఎల్లారెడ్డి,కోడం రమణ పాల్గొన్నారు