
World Auto Driver Day
ఆటో డ్రైవర్ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలి
టిఏడియు రాష్ట్ర అడ్వాయిజరి బోర్డుమెంబర్ రాజ్ కుమార్
ఘనంగా ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం
నర్సంపేట,నేటిధాత్రి:
కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో కుటుంబాలను పోషించలేని పరిస్థితుల్లో ఉన్న ఆటో డ్రైవర్ కార్మికులను ప్రభుత్వమే ఆదుకోవాలని
టిఏడియు రాష్ట్ర అడ్వాయిజరి బోర్డుమెంబర్ శానబోయిన రాజ్ కుమార్ డిమాండ్ చేశారు.ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవం సందర్భంగా తెలంగాణ ఆటో డ్రైవర్స్ యూనియన్ (టిఏడియు)ఆధ్వర్యంలో దుగ్గొండి మండలంలోని గిర్నీబావిలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ రెడ్డితో కలిసి శానబోయిన రాజ్ కుమార్ కేక్ కట్ చేసి ఆటో కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల హామీలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి ఆటో డ్రైవర్ కు రూ.12 వేలు అమలు చేయాలి.లేబర్ కార్డ్ అందించి, 5లక్షల ఎక్స్ గ్రెషియా ప్రకటించాలని తెలిపారు.మహాలక్ష్మి పథకం వలన ఆటో డ్రైవర్ కార్మికులు రోడ్డున పడ్డాయని అవేదన వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో టిఏడియు మండల అధ్యక్షులు బూర రామకృష్ణ గౌడ్,
మండల గౌరవ సలహాదరుడు మోడెం విద్యాసాగర్,నాయకులు నరసింహ,కార్యదర్శి దండు రాజు, అడ్డాల అధ్యక్షులు పొగాకు దేవేందర్, తెప్పే శెంకర్, గణేష్, రాజేందర్, రహీం, ప్రశాంత్, దేవేందర్, అశోక్,రాజు, నాగరాజు, రాంరాజు, సాంబయ్య, నరేష్,సాంబమూర్తి మండలములోని అన్ని అడ్డాల డ్రైవర్ కార్మికులు పాలుగోన్నారు.