
General Secretary Dr. Bongoni Suresh Goud.
మద్దూరు మండలం పిట్టల గూడెం సమస్యలు ప్రభుత్వం పరిష్కరించాలి:
బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్
మద్దూరు నేటి ధాత్రి
జనగామ నియోజకవర్గం మద్దూరు మండలం లో ధర్మారం గ్రామం పిట్టల గూడెం లో బీజేపీ మండల అధ్యక్షులు ఉదయ్ రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశానికి బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. బొంగోని సురేష్ గౌడ్ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ధర్మారం గ్రామ పిట్టల గూడెం లో కనీస వసతులు లేవని, ఉండడానికి ఇల్లు లేక గుడిసెల్లో జీవనం సాగిస్తుంటే పాము కాటుకు గురి కానీ కుంటుంబం అంటూ లేదు అని బాధపడ్డారు అలాగే మురుగు నీరు రోడ్లమీద ప్రవహిస్తుంటే ఈ కాలనీ వాసులు రోగాల పాలు అవుతున్నారని, కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మరుగు దొడ్లు మంజూరు చేపిస్తే ఈ కాలనీ వాసులకు ఇవ్వలేని దుస్థితి నెలకొనడం బాధాకరం అని వాపోయారు స్థానిక శాసనసభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి కి, కాంగ్రెస్ ఇక్కడి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి కంటికి కనబడడం లేదా అని మండిపడ్డారు. పిట్టల గూడెం ప్రజల సమస్యలను పరిష్కరించాలని లేని యెడల వారి వారికీ అండగా బీజేపీ పోరాడుతుందని హెచ్చరించారు.అదేవిదంగా పిట్టల గూడెం రోడ్డు అద్వానంగా తయారై నిత్యం ప్రమాదలకు గురై నానా అవస్థలు పడుతున్నారని వెంటనే తారు రోడ్ ను వేయాలని డిమాండ్ చేశారు.అనంతరం పిట్టల గూడెం వాసులతో కలిసి వారి గుడిసెలో భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల నాయకులు కూరెళ్ల కిరణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శి బియ్య రమేష్, నరదాసు సందీప్, బండి శ్రీహరి,వినయ్, సిరిమల్లె సురేష్, ఏలూరి శివ, రవి, బొల్లు రాజు, ప్రశాంత్, సాయి కిరణ్, సాయి బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.