
Students Demand Pending Scholarships Release
స్కాలర్షిప్ మరియు రీయింబర్స్మెంట్ ఫీజులు ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి
విద్యాశాఖ మంత్రిని వెంటనే కేటాయించాలి
జిల్లా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ ఆధ్వర్యంలో దీక్ష
సిరిసిల్ల టౌన్:( నేటిధాత్రి )
సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్.ఎఫ్.ఐ రాజన్న సిరిసిల్ల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని. ఈ ఫీజు దీక్ష ను ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శులు మల్లారపు అరుణ్ కుమార్, ఎర్రవెల్లి నాగరాజు ముఖ్య అతిధులుగా హాజరై ప్రారంభించారు.ఈ సందర్భంగా ఎస్.ఎఫ్.ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్లో స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ 8158 వేల కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయని వాటిని విడుదల చేయకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఉన్నత చదువుల కోసం వెళ్లాలంటే ప్రైవేటు యాజమాన్యాలు సర్టిఫికెట్స్ ఇవ్వకపోవడంతో విద్యార్థులు డబ్బులు కట్టలేక మధ్యలోనే చదువులు ఆపేసే పరిస్థితి నెలకొందని అన్నారు ఇప్పటివరకు రాష్ట్రానికి విద్యాశాఖ మంత్రిని కేటాయించకపోవడం సిగ్గుచేటని అన్నారు ప్రభుత్వ విద్యారంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గాలికి వదిలేసిందని విమర్శించారు పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ కాస్మోటిక్ చార్జీలు పెంచడంలో విఫలమైందని అన్నారు అద్దె భవనాల్లో నడుస్తున్న హాస్టళ్లకు సొంత భవనాలు నిర్మించాలని అన్నారు వెంటనే స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోతే భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణ ప్రకటించుకొని విద్యార్థులందరినీ కలుపుకొని ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఫీజు దీక్షలో సుమారుగా 500 మంది విద్యార్థులు పాల్గొన్నారు.ఫీజు దీక్షకు మద్దతుగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గాంతుల మహేష్, సీ.ఐ.టీ.యూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎల్లారెడ్డి రమణ లు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు గుండెల్లి కళ్యాణ్, ఉపాధ్యక్షులు జాలపల్లి మనోజ్ కుమార్, గర్ల్స్ కన్వీనర్ సంజన జిల్లా కమిటీ సభ్యులు శివ, భరత్, జశ్వంత్, నాయకులు తిరుపతి, మహేష్, నవీన్, శివ చరణ్, అజయ్, దినకర్, ప్రసంగి, జలంధర్,అఖిల,అక్షయ, ప్రనుష తదితరులు పాల్గొన్నారు.