BJP Demands Compensation for Crop Loss in Nallabelli
దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలి.
#మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్.
నల్లబెల్లి, నేటి ధాత్రి:
మండలంలోని పలు గ్రామాలలో మొంథా తుపాను ప్రభావంతో దెబ్బతిన్న పంటలకు తక్షణమే నష్టపరిహారం అందించాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు తడుక వినయ్ గౌడ్ అన్నారు.గురువారం మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వినయ్ గౌడ్ మాట్లాడుతూ..కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట,వెన్ను దశలో ఉన్న పంట నేలకొరిగి కంకులు నీటిలో నానుతున్నాయని తెలిపారు.ఫలితంగా దిగుబడి తగ్గడంతోపాటు ఖర్చులు పెరుగుతాయని పేర్కొన్నారు.ప్రభుత్వం తుపాను గురించి సకాలంలో హెచ్చరికలు చేయడంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేయకపోవడంతోనే భారీగా పంట నష్టం జరిగిదన్నారు. పెనుగాలుల కారణంగా పంటలు భారీగా దెబ్బతిన్నాయని పేర్కొన్నారు.తక్షణమే పంట నష్టం గురించి అంచనా వేసేందుకు వ్యవసాయ,రెవెన్యూ శాఖల అధికారులతో బృందాలను వేసి,పంటలు నష్టపోయిన రైతులను గుర్తించి జాబితాను రూపొందించాలని కోరారు.ఎకరాకు వరికి రూ.25 వేలు,మొక్కజొన్న , పత్తి వంటి పంటలకు ఎకరాకు రూ.50 వేలు పంట నష్టపరిహారం ఇచ్చి ప్రభుత్వం రైతులను,కౌలు రైతులను ఆదుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ మెంబర్ బొద్దిరెడ్డి ప్రతాప్ రెడ్డి,జిల్లా నాయకులు బచ్చు వెంకటేశ్వర్ రావు,మండల ప్రధాన కార్యదర్శి ఈర్ల నాగరాజు,మండల ఉపాధ్యక్షుడు బత్తిని కుమారస్వామి,మండల కార్యదర్శి బూర కృష్ణ, మండల నాయకులు వల్లే పర్వాతలు,బోట్ల ప్రతాప్,నాగిరెడ్డి రాజిరెడ్డి,బూత్ అధ్యక్షులు ఊటుకూరి చిరంజీవి, నాగపూరి సాగర్,కొలిపాక దేవేందర్ పార్టీ నాయకులు కొనుకటి మధుకర్,చెంచు వినయ్ తదితరులు పాల్గొన్నారు.
